Bank Strike: కస్టమర్స్ బీ అలెర్ట్.. మళ్ళీ సమ్మె సైరెన్ మ్రోగించనున్న బ్యాంక్ ఉద్యోగులు.. ఎప్పుడంటే

ప్రైవేట్‌ ఉద్యోగస్థుల తరహా పనివేళలు తమకు ఉండాలని బ్యాంక్‌ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇదే విషయంపై గత కొన్నేళ్లుగా తాము ఎన్ని సార్లు చెబుతున్నా..  తమను ఎవరు పట్టించుకోవడం లేదని బ్యాంక్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Bank Strike: కస్టమర్స్ బీ అలెర్ట్.. మళ్ళీ సమ్మె సైరెన్ మ్రోగించనున్న బ్యాంక్ ఉద్యోగులు.. ఎప్పుడంటే
Bank Strike
Follow us
Surya Kala

|

Updated on: Jan 13, 2023 | 6:45 AM

ఈ నెలాఖరున ఏమైనా ముఖ్యమైన బ్యాంక్ లావాదేవీలను జరపడం కోసం షెడ్యూల్ చేసుకున్నారా.. అయితే కస్టమర్స్ బీ అలెర్ట్.. ఎందుకంటే.. ఉద్యోగులు మళ్ళీ సమ్మె సైరన్ మ్రోగించారు. బ్యాంక్‌ ఉద్యోగ సంఘం రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నామని ప్రకటించింది. దీంతో ఆ రెండు రోజుల్లో బ్యాంక్ లావాదేవీలపై, ఏటీఎం సేవలపై ప్రభావం పడనుంది.

ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈనెలలోనే రెండ్రోజులపాటు సమ్మెకు దిగబోతున్నారు. జనవరి 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నట్టు ప్రకటించించింది బ్యాంక్‌ ఉద్యోగ సంఘాల సమాఖ్య. ఐదు రోజుల పని దినాలు, ఎన్‌పీఎస్‌ రద్దు, వేతనాల పెంపు, ఖాళీల భర్తీ సాధనే లక్ష్యంగా సమ్మెకు వెళ్తున్నట్లు వెల్లడించారు. తమ డిమాండ్లపై చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేసింది బ్యాంక్‌ ఉద్యోగ సంఘాల సమాఖ్య. ఈ డిమాండ్లపై ఎప్పట్నుంచో పోరాడుతున్నామని, ఎన్నిసార్లు లేఖలు రాసినా ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ స్పందించడం లేదంటున్నారు ఉద్యోగులు. అందుకే, తమ డిమాండ్ల సాధన కోసం మరోసారి సమ్మెకు దిగుతున్నట్లు చెప్పారు.

ప్రైవేట్‌ ఉద్యోగస్థుల తరహా పనివేళలు తమకు ఉండాలని బ్యాంక్‌ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇదే విషయంపై గత కొన్నేళ్లుగా తాము ఎన్ని సార్లు చెబుతున్నా..  తమను ఎవరు పట్టించుకోవడం లేదని బ్యాంక్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకనే తమ డిమాండ్ సాధన కోసం సమ్మె చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..