బాయ్ ఫ్రెండ్ అంటే ఎంత ప్రేమో.. ప్రియుడి పుట్టినరోజు కోసం తన ఇంట్లోనే ఆ పని చేసి.. అడ్డంగా దొరికిపోయి..
మహారాష్ట్ర రాజధాని ముంబయి సమీపంలోని థానేలో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ప్రియుడి పుట్టినరోజు వేడుకల కోసం ఓ అమ్మాయి తన ఇంట్లోనే నగలు దొంగిలించింది. విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో కొత్త నాటకానికి...

మహారాష్ట్ర రాజధాని ముంబయి సమీపంలోని థానేలో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ప్రియుడి పుట్టినరోజు వేడుకల కోసం ఓ అమ్మాయి తన ఇంట్లోనే నగలు దొంగిలించింది. విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో కొత్త నాటకానికి తెర లేపింది. తన ఫొటోలను సదరు యువకుడు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించింది. అసలు విషయాలు తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.సోషల్ మీడియాలో అసభ్యకరమైన చిత్రాలను అప్‌లోడ్ చేస్తానని బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాలిక ఆరోపించిన యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు విచారణలో నగలు ఏం చేశారనే విషయాలు వివరించాడు. దీంతో పోలీసులు నగలు అమ్మిన దుకాణానికి వెళ్లారు. అయితే.. తన వద్దకు ఎవరూ రాలేదని, ఎలాంటి నగలూ విక్రయించలేదని షాపు యజమాని చెప్పడంతో వారు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. దీంతో తనను తాను రక్షించుకునేందుకు ఈ ప్లాన్ వేసినట్లు బాలిక వెల్లడించింది.
బాలుడు, బాలిక ఇద్దరి పుట్టినరోజు తేదీలు ఒకటే. వారిద్దరి పుట్టినరోజును ఒకే తేదీన జరుపుకునే అవకాశం వచ్చింది. అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ప్లాన్ చేశారు. దీంతో ఆ యువతి తన ఇంట్లో నగలను దొంగిలించి ప్రియుడి సాయంతో మాన్‌పాడ ప్రాంతంలోని నగల వ్యాపారికి విక్రయించింది. నగలు విక్రయించి రూ.53 వేలు తీసుకున్నారుర. ఆ డబ్బుతో ఇద్దరూ కలిసి సరదాగా పార్టీ చేసుకున్నారు. కానీ ఇంట్లోని ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించడంతో, బాలిక భయాందోళనకు గురై తన స్నేహితుల్లో ఒకరిపై నింద మోపింది.
ఈ కేసు జనవరి 7న థానేలోని కపూర్‌బావడి పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. ప్రియుడితో సహా ఇద్దరిని అరెస్టు చేశారు. బాలికను జువైనల్ హోంకు తరలించారు. ఐపీసీ సెక్షన్ 380, 411 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…



