లీవ్ అడిగితే కుదరదన్నారు.. డ్యూటీకి వెళ్లాక కుమారుడు చనిపోయాడు.. కన్నీరు పెట్టిస్తున్న ఘటన..

అనారోగ్యంతో బాధపడుతున్న భార్య.. రెండేళ్ల కుమారుడు ఉన్నారు సర్. వాళ్లను చూసుకోవడానికి ఎవరూ లేరు. కాబట్టి నాకు కొద్ది రోజులు సెలవులు కావాలంటూ ఎస్ఎస్పీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు ఓ కానిస్టేబుల్....

లీవ్ అడిగితే కుదరదన్నారు.. డ్యూటీకి వెళ్లాక కుమారుడు చనిపోయాడు.. కన్నీరు పెట్టిస్తున్న ఘటన..
Constable Protest
Follow us

|

Updated on: Jan 13, 2023 | 7:24 AM

అనారోగ్యంతో బాధపడుతున్న భార్య.. రెండేళ్ల కుమారుడు ఉన్నారు సర్. వాళ్లను చూసుకోవడానికి ఎవరూ లేరు. కాబట్టి నాకు కొద్ది రోజులు సెలవులు కావాలంటూ ఎస్ఎస్పీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు ఓ కానిస్టేబుల్. అయితే.. అతని అభ్యర్థనను ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. విధులకు రావాల్సిందేనని హుకుం జారీ చేశారు. దీంతో చేసేదేమీ లేక అతను డ్యూటీకి వెళ్లాడు. అంతలోనే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఆడుకుంటూ బయటకు వెళ్లిన చిన్నారి.. ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మథుర ప్రాంతానికి చెందిన సోనూ చౌదరి.. బైద్​పుర్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన భార్య కవితతో కలిసి ఏక్తా కాలనీలో నివాసముంటున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు హర్షిత్ ఉన్నాడు. కవితకు గతేడాది డిసెంబర్​లో ఆపరేషన్​ జరిగింది. ఆమెను డిశ్చార్జ్ చేసిన వైద్యులు.. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

ఈ క్రమంలో భార్యకు ఆపరేషన్ జరగడం, రెండేళ్ల కుమారుడు ఉండటంతో వారిద్దరినీ చూసుకునేందుకు సెలవులు కావాలని కోరాడు. జనవరి 7న ఎస్ఎస్పీ కార్యాలయానికి అప్లై చేసుకున్నాడు. అయితే అధికారులు మాత్రం సోనూకు లీవ్ ఇవ్వలేదు. దీంతో సోనూ ఎప్పటిలానే విధులకు వెళ్లాడు. అనారోగ్యంతో ఉన్న భార్య ఇంట్లోనే ఉంది. ఇంతలోనే వారి కుమారుడు హర్షిత్ ఇంటి నుంచి బయటకు వెళ్లి నీటి గుంటలో పడిపోయాడు. ఎంతకీ హర్షిత్​ తిరిగి ఇంటికి రాకపోడంతో చుట్టుపక్కలా వెతికారు. ఆయినా బాలుడి ఆచూకీ కనిపించలేదు.

ఈ క్రమంలో గుంటలో పడి హర్షిత్ ను గుర్తించారు. వెంటనే హర్షిత్​ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరిశీలించిన వైద్యులు.. అప్పటికే హర్షిత్ మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో తనకు సెలవు తనకు ఎంత అవసరమో తెలియజేస్తూ.. కుమారుడు మృతదేహంతో ఎస్​ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాడు సోనూ. ఎస్​ఎస్పీ కార్యాలయంలోని అధికారులు కానిస్టేబుల్​ను ఓదార్చి తిరిగి ఇంటికి పంపించారు. దీనిని తీవ్రంగా తీసుకున్న ఉన్నతాధికారులు ఘటనపై విచారణకు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…