Ram Setu: వందల ఏళ్ల కల తీరనున్న వేళ.. సేతుసముద్రం ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు

సేతు సముద్ర నిర్మాణం చేపట్టాలంటూ పార్టీలకు అతీతంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానించింది. సీఎం స్టాలిన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా బీజేపీ సహా అన్ని పార్టీలు మద్దతు పలికాయి.

Ram Setu: వందల ఏళ్ల కల తీరనున్న వేళ.. సేతుసముద్రం ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు
Ram Setu
Follow us
Surya Kala

|

Updated on: Jan 13, 2023 | 7:25 AM

భారత్‌, శ్రీలంక మధ్య రామసేతు ప్రాంతంలో సేతుసముద్రం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటూ తమిళనాడు ప్రభుత్వం తీర్మానించింది. దీనికి బీజేపీ సైతం మద్దతు ప్రకటించింది. దీంతో వందల ఏళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్టు నిర్మాణంపై మరోసారి ఆశలు చిగురించాయి. చాలా కాలంగా ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న బీజేపీ.. తాజాగా డీఎంకేకు మద్దతు పలికింది. అయితే, రామసేతుకు నష్టం వాటిల్లకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని షరతు విధించింది. సేతు సముద్ర నిర్మాణం చేపట్టాలంటూ పార్టీలకు అతీతంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానించింది. సీఎం స్టాలిన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా బీజేపీ సహా అన్ని పార్టీలు మద్దతు పలికాయి. సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణంలో కొనసాగుతున్న జాప్యం తమిళనాడు అభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి అవరోధంగా మారుతోంది. అందుకే నిలిచిపోయిన ప్రాజెక్టు పనులను కొసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామంటూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానించింది. భారత్‌, శ్రీలంక మధ్య రామసేతు ఉందని చెప్పడం కష్టమంటూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ మధ్యే కామెంట్ చేశారు.

అయితే తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు ఈ తీర్మానం తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తూర్పు, పశ్చిమ తీరాల మధ్య ప్రయాణించాలంటే ప్రస్తుతం శ్రీలంకను చుట్టి రావాల్సి వస్తోంది. అలా కాకుండా నౌకలు ప్రయాణించేందుకు వీలుగా చిన్నపాటి మార్పులు చేసినట్లయితే అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లకుండా కేవలం భారత్‌ జలాల ద్వారానే రవాణా చేసుకునే వీలుంటుంది. ఇందుకోసం భారత్‌, శ్రీలంక మధ్య ఉన్న సముద్రంలో సేతుసముద్ర ప్రాజెక్టు నిర్మించాల్సి ఉంటుంది. ఇది ఆర్థికంగా అటు తమిళనాడుకు, ఇటు భారత్‌కు ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, నౌకల రవాణాకు అనుకూలంగా మార్చాలంటే పురాతన రామసేతు మార్గంలో కొంతభాగాన్ని తవ్వాల్సి వస్తోంది. ఇది ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిబంధకంగా మారింది. గతంలో చాలా సార్లు ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు పడినా..మత పరంగా సున్నితమైన అంశం కావడంతో ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?