Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Jodo Yatra: ఈనెల 30న భారత్‌ జోడో యాత్ర ముగింపు సభ.. 24 రాజకీయ పార్టీ నేతలకు ఆహ్వానం

ఈనెల 30న భారత్‌ జోడో యాత్ర ముగింపు సభ జరగనుంది. రాహుల్ జోడో యాత్ర ముగింపు సభకు 24 రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం.

Bharat Jodo Yatra: ఈనెల 30న భారత్‌ జోడో యాత్ర ముగింపు సభ.. 24 రాజకీయ పార్టీ నేతలకు ఆహ్వానం
Bharat Jodo Yatra
Follow us
Surya Kala

|

Updated on: Jan 12, 2023 | 6:18 AM

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేస్తోన్న జోడో యాత్ర త్వరలో ముగింపు చెప్పనున్నారు. దీంతో భారత్ జోడో యాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. గత సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల 30న ముగియనుంది. దీంతో రాహుల్ జోడో యాత్ర ముగింపు సభకు 24 రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమై కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ మీదుగా సాగిన యాత్ర.. ప్రస్తుతం పంజాబ్ చేరుకుని ఇక్కడే కొనసాగుతోంది. కొన్నాళ్లకు.. పంజాబ్ దాటి హిమాచల్ ప్రదేశ్ చేరుకుంటుంది. అక్కడా ముగించుకుని జమ్మూ కశ్మీర్ చేరుకుంటుంది. ఈ రాష్ట్రంలో పర్యటన తర్వాత భారత్ జోడో యాత్ర ముగుస్తుంది. యాత్ర ప్రారంభానికి ముందు కాంగ్రెస్ లో ఆందోళనలు ఉండేవి.

2014 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాత.. కాంగ్రెస్ పరిస్థితి దారుణ పరిస్థితికి చేరింది. ఈస్థితిలో రాహుల్ యాత్ర పట్ల కాంగ్రెస్ వర్గాల్లోనే అనుమానాలు ఉండేవట. అయితే యాత్ర ప్రారంభై కొనసాగుతున్న క్రమంలో.. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో నమ్మకాలు బలపడ్డాయట. పార్టీకి పూర్వ వైభవం వచ్చిందన్న ఆనందంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. దీంతో ఈ యాత్ర ముగింపు సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇందు కోసం దేశంలో భావసారూప్యత కలిగిన 24 పార్టీల అధినేతలకు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. బీఎస్పీ- మాయావతి, టీఎంసీ- మమతా బెనర్జీ, జేడీయూ- నితీశ్ కుమార్, టీడీపీ- చంద్రబాబు నాయుడు, ఆర్జేడీ- లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాదీ- అధినేత అఖిలేష్ యాదవ్, వంటి వారితో పాటు.. కమ్యూనిస్ట్ పార్టీలతో సహా మరికొన్ని పార్టీలకు స్వాగతం పలికారు. జనవరి 30న జరిగే సభను ఎలాగైనా సరే విజయవంతం చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది కాంగ్రెస్ అధిష్టానం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..