Ram Setu: సేతు సముద్రం ప్రాజెక్టుకు పచ్చజెండా.. బీజేపీ మద్దతుతో ముందుకెళ్లనున్న స్టాలిన్ సర్కార్.. కానీ..

రామసేతు.. ఈ పేరు వింటేనే చాలు. రామాయణంలోని కీలక ఘట్టాలు కళ్లముందు మెదులుతుంటాయి. శ్రీరాముడు లంకకు వెళ్లేందుకు వానర సైన్యం సహాయంతో సముద్రంపై నిర్మించిన వంతెన ఇదేనని పలువురు ఇప్పటికీ...

Ram Setu: సేతు సముద్రం ప్రాజెక్టుకు పచ్చజెండా.. బీజేపీ మద్దతుతో ముందుకెళ్లనున్న స్టాలిన్ సర్కార్.. కానీ..
Ram Setu
Follow us

|

Updated on: Jan 13, 2023 | 6:40 AM

రామసేతు.. ఈ పేరు వింటేనే చాలు. రామాయణంలోని కీలక ఘట్టాలు కళ్లముందు మెదులుతుంటాయి. శ్రీరాముడు లంకకు వెళ్లేందుకు వానర సైన్యం సహాయంతో సముద్రంపై నిర్మించిన వంతెన ఇదేనని పలువురు ఇప్పటికీ నమ్ముతుంటారు. ఈ క్రమంలో ‘సేతు సముద్రం’ ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న బీజేపీ.. తాజాగా అధికార డిఎంకేకు మద్దతు తెలిపింది. అయితే.. రామసేతుకు నష్టం వాటిల్లకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కండిషన్ పెట్టింది. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీ గురువారం తీర్మానం చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి ప్రతిపక్ష బీజేపీతో పాటు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే.. వాణిజ్య కార్యకలాపాలు, తమిళనాడు అభివృద్ధి వేగవంతం అవుతాయని సీఎం స్టాలిన్ తీర్మానంలో జతచేశారు.

అయితే.. భారత్‌, శ్రీలంక మధ్య రామసేతు ఉందని చెప్పడం కష్టమంటూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ ఇటీవల కామెంట్లు చేశారు. అయితే ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం ఈ తీర్మానం తీసుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్దేశం తూర్పు, పశ్చిమ తీరాల మధ్య ప్రయాణించాలంటే ప్రస్తుతం శ్రీలంకను చుట్టి రావాల్సి వస్తోంది. అలా కాకుండా నౌకలు ప్రయాణించేందుకు వీలుగా చిన్నపాటి మార్పులు చేస్తే అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లకుండా కేవలం భారత్‌ జలాల ద్వారానే రవాణా చేసుకునే వీలుంటుంది. ఆర్థికంగా తమిళనాడుకు, భారత్‌కూ చాలా ఉపయుక్తంగా ఉంటుంది.

సేతు సముద్రం ప్రాజెక్టు చేపట్టాలని 1860లో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం భావించింది. రామసేతు హిందువులకు సంబంధించిన స్థలమని, దానిని కూల్చడానికి వీల్లేదంటూ కొన్ని మత సంఘాలు ఆందోళనలు చేశాయి. దీంతో బ్రిటిష్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గతంలోనే డీఎంకే ప్రయత్నించినా.. కొన్ని కారణాలతో అవి నిలిచిపోయాయి. తాజాగా.. బీజేపీ మద్దతులో ప్రాజెక్టుకు అడుగులు వేగంగా పడనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!