Sharad Yadav: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస..
కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత, శరద్ యాదవ్(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్ ధ్రువీకరించారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో..
కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత, శరద్ యాదవ్(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్ ధ్రువీకరించారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో 1947 జులై 1న శరద్ యాదవ్ జన్మించారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. మాజీ ప్రధాని వాజ్‌పేయ్ ప్రభుత్వంలో శరద్ యాదవ్ కేంద్ర మంత్రిగా పలు శాఖల్లో పని చేశారు. 2003లో జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) జాతీయ అధ్యక్షుడయ్యారు. ఏడు సార్లు లోక్ సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన మృతిపై రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…