MV Ganga Vilas: మొదటి పర్యటనకు సిద్ధమైన ‘ఎంవీ గంగా విలాస్’.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. నౌక ప్రత్యేకతలివే..

భారతదేశ మొట్టమొదటి నదీ పర్యటక నౌక  కావడం ఎంవీ గంగా విలాస్ ప్రత్యేకత. ఇక గంగా, బ్రహ్మపుత్ర  నదుల మీదుగా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌక.. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక..

MV Ganga Vilas: మొదటి పర్యటనకు సిద్ధమైన ‘ఎంవీ గంగా విలాస్’.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. నౌక ప్రత్యేకతలివే..
Pm Modi To Flag Off Mv Ganga Vilas On Jan 13
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 13, 2023 | 9:27 AM

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ ‘ఎంవీ గంగా విలాస్‌’ను ఈ రోజు(జనవరి 13) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ వారణాసిలో టెంట్ సిటీని ప్రారంభించడంతో పాటు రూ.1000 కోట్ల విలువైన అనేక ఇతర అంతర్గత జలమార్గాల ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేస్తారు. జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర కేంద్ర మంత్రులు, పలు శాఖల సీనియర్ అధికారుల సమక్షంలో జరగనున్న ఈ క్రూయిజ్ ప్రారంభ వేడుకను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ నిర్వహిస్తారు.

భారతదేశ మొట్టమొదటి నదీ పర్యటక నౌక  కావడం ఎంవీ గంగా విలాస్ ప్రత్యేకత. ఇక గంగా, బ్రహ్మపుత్ర  నదుల మీదుగా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌక.. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక నౌకగా కూడా ఖ్యాతిని గడించింది. ఈ నౌకలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో పాటు సూట్‌ గదులు, స్పా, జిమ్‌ సెంటర్లు, ఫ్రెంచ్ బాల్కనీలు, LED టీవీలు, సేఫ్‌లు, స్మోక్ డిటెక్టర్లు, కన్వర్టిబుల్ బెడ్లు వంటివి కూడా ఉన్నాయి.

ఎంవీ గంగా విలాస్ ప్రత్యేకతలు:

51 రోజుల పాటు సాగే తన మొదటి పర్యటనను వారణాసి నుంచి ఈ రోజే ప్రారంభించనున్న ఎంవీ గంగా విలాస్ .. భారత్‌లోని ఐదు రాష్ట్రాలను, బంగ్లాలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ మొత్తం 3,200 కి.మీ దూరం ప్రయాణించి దిబ్రూఘర్ చేరుకుంటుంది. అంతేకాక 27 నదీ వ్యవస్థల మీదుగా ఈ నౌక ప్రయాణించనుంది. ఇక ఈ నౌక తన మొదటి పర్యటనలో భాగంగా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్‌లు, బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఢాకా, అస్సాంలోని గువాహతి వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంది. ఎంవీ గంగా విలాస్ తన తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది పర్యాటకులను తీసుకెళ్లనుంది.

ఇవి కూడా చదవండి

టికెట్‌ ధర ఇలా..

జనవరి 13న వారణాసిలో ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించిన తర్వాత ఈ నౌక తన తొలి ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది ప్రయాణికులు పర్యటించనున్నట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. వీరు మార్చి 1న దిబ్రూగఢ్‌ చేరుకుంటారని తెలిపారు. మరి ఇంత ప్రత్యేకమైన ఈ గంగా విలాస్‌ టికెట్ ధర ఎంతో తెలుసా..? ఒక్కో ప్రయాణికుడికి రోజుకు దాదాపు రూ.25వేలు. అంటే ఈ యాత్ర మొత్తానికి రూ.12.75లక్షల ఖర్చవుతుందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…