- Telugu News Photo Gallery Business photos Amazon giving up to 75 percent off discount offer on Bluetooth calling Smartwatches
Smartwatches: బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లపై 75% డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. వెంటనే కొనుగోలు చేయండి..
Smartwatches: బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అనేది ఇప్పుడు ఖరీదైన స్మార్ట్‌వాచ్ మోడల్‌లలోనే కాదు.. తక్కువ ధరలో కూడా అందుబాటులో ఉంది. కేవలం రూ.2500 కంటే తక్కువ ధరలో లభించే కొన్ని స్మార్ట్‌వాచ్ మోడల్స్ ఈ ఫీచర్‌తో ఈ కామర్స్ సైట్‌లలో ఉన్నాయి. వాటి వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jan 12, 2023 | 10:06 AM

Smartwatches: బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అనేది ఇప్పుడు ఖరీదైన స్మార్ట్‌వాచ్ మోడల్‌లలోనే కాదు.. తక్కువ ధరలో కూడా అందుబాటులో ఉంది. కేవలం రూ.2500 కంటే తక్కువ ధరలో లభించే కొన్ని స్మార్ట్‌వాచ్ మోడల్స్ ఈ ఫీచర్‌తో ఈ కామర్స్ సైట్‌లలో ఉన్నాయి. వాటి వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పలు స్మార్ట్‌వాచ్ మోడల్స్‌పై Amazon వంటి దిగ్గజ ఈ కామర్స్ కంపెనీలు దాదాపు 75 శాతం డిస్కౌండ్ ఆఫర్‌ను అందిస్తున్నాయి. మరి ఏయే స్మార్ట్‌వ్యాచ్‌లపై ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుందో చూద్దాం..

Noise Smartwatches: నాయిస్ పల్స్ గో బజ్ వాచ్‌లో 1.69-అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది. ఇది 240*280 పిక్సెల్ రిజల్యూషన్‌తో 550 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇంకా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు, హ్యాండ్ వాష్ రిమైండర్, ఐడిల్ అలర్ట్, డ్రింక్ వాటర్ రిమైండర్, వెదర్ అలెర్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 100 స్పోర్ట్స్ మోడ్‌లు ఈ స్మార్ట్‌వాచ్‌లో ఉన్నాయి. అమెజాన్‌లోని లిస్టింగ్ ప్రకారం ఈ వాచ్ 7 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అయితే కాలింగ్ ఫీచర్‌తో 1 రోజు బ్యాకప్ ఇస్తుంది. 64 శాతం తగ్గింపు తర్వాత మీరు దీనిని రూ.1799లకే పొందవచ్చు.

CrossBeats Smartwatch: క్రాస్‌బీట్స్ ఇగ్నైట్ అడ్వాన్స్‌డ్ వాచ్ 1.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండడమే కాక ఇది హార్ట్ బీట్ రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలని గుర్తించే ఫీచర్స్‌తో వస్తుంది. ఈ వాచ్‌లో మీరు రక్తపోటు, నిద్ర పర్యవేక్షణ, థియేటర్ మోడ్, 7 రోజుల నిద్ర డేటా వంటి ఫీచర్‌లను పొందుతారు. అమెజాన్‌లోని లిస్టింగ్ ప్రకారం ఈ వాచ్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 2 గంటలు పడుతుంది. 73 శాతం తగ్గింపు తర్వాత ఈ వాచ్‌ను రూ.1899లకే కొనుగోలు చేయవచ్చు.

Fire-Boltt Smartwatch: ఫైర్ బోల్ట్ బ్రాండ్ స్మార్ట్ వాచ్‌లో రక్తంలోని ఆక్సిజన్ స్థాయి, హృదయ స్పందన రేటును ట్రాక్ చేసే ఫీచర్ ఉంటుంది. ఈ వాచ్‌లో మీరు 1.7 అంగుళాల స్క్రీన్‌తో పాటు అలారం, వాతావరణ సూచన, రిమోట్ కంట్రోల్, కెమెరా ఫీచర్‌ల వంటి స్మార్ట్ ఫీచర్స్‌తో వస్తుంది. బ్యాటరీ గురించి చెప్పాలంటే బ్లూటూత్ కాలింగ్ లేకుండా వాచ్ 8 రోజుల పాటు పని చేస్తుంది. బ్లూటూత్ కాలింగ్‌తో సాధారణ ఉపయోగంలో 24 గంటల పాటు ఉంటుంది. 75 శాతం తగ్గింపు తర్వాత ఈ వాచ్ అమెజాన్‌లో రూ.2499లకే అందుబాటులో ఉంది.





























