- Telugu News Photo Gallery Business photos MG Hector facelift launched in Auto Expo 2023 at Rs 14.73 lakh and check here for more details
MG Hector 2023: రూ. 14.73 లక్షలకే 7 సీటర్ ఈవీ కార్.. అద్దిరిపోయే ఫీచర్లతో విడుదల చేసిన ఎమ్‌జీ మోటార్..
MG మోటార్ కంపెనీ 2023 జనవరిలో ఢిల్లీ వేదికగా ఆటో ఎక్స్‌పోలో హెక్టర్ ఫేస్‌లిఫ్ట్, హెక్టర్ ప్లస్ ఫేస్‌లిఫ్ట్ SUVలను అధికారికంగా విడుదల చేసింది. ఈ 7 సీటర్ కొత్త కారు ఈ సారి అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌తో మార్కెట్లోకి ప్రవేశించింది. దీని ప్రత్యేకలేమంటే ఇందులో ఎన్నో రకాల కొత్త ఫీచర్లు, సెక్యూరిటీ ఉన్నాయి.
శివలీల గోపి తుల్వా | Edited By: Anil kumar poka
Updated on: Jan 12, 2023 | 6:20 PM

MG మోటార్ ఢిల్లీ ఆటో ఎక్స్పో వేదికగా కొత్త హెక్టర్ ఫేస్‌లిఫ్ట్, హెక్టర్ ప్లస్ మోడళ్లను విడుదల చేసింది.

ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రకారం హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ.14.73 లక్షల నుంచి రూ.21.73 లక్షలు.

అలాగే 7-సీటర్ హెక్టర్ ప్లస్ ధర ఎక్స్-షోరూమ్ రూ. 20.15 లక్షల నుంచి రూ. 22.43 లక్షలు.

హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ స్టైల్, షైన్, స్మార్ట్, స్మార్ట్ ప్రో, సావీ ప్రో వేరియంట్‌లతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

మునుపటి కొత్త కార్ల మాదిరిగానే 1.5 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి.

పెట్రోల్ మోడల్‌లలో కొనుగోలు చేయడానికి 6-స్పీడ్ మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

డీజిల్ మోడల్‌లలో కొనుగోలు చేయడానికి 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపిక మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ కొత్త కారు 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్రోమ్ సరౌండ్, రీడిజైన్‌లతో ఉన్న వెనుక బంపర్ అసెంబ్లీ వంటి వినూత్న ఫీచర్లతో పదునైన డిజైన్‌ను కలిగి ఉంది.

కారు లోపలి భాగంలో కూడా14.0-అంగుళాల టచ్ స్క్రీన్ డాష్‌బోర్డ్, D-షేప్ AC వెంట్‌లు, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో అనేక మార్పులను పొందింది.

భద్రత కోసం వివిధ సేఫ్టీ ఫీచర్లతో లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌తో కూడిన ఈ కొత్త కారు మహీంద్రా XUV700, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్‌లకు గట్టి పోటీనివ్వబోతుంది.





























