- Telugu News Business Get Kabira Mobility Kollegio Electric Scooter with Mileage Range 100KM in Cheapest Price
Cheapest e-Scooter: రూ.45 వేలకే అద్దిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జింగ్ పెడితే సెంచరీ కొట్టేయచ్చు..!
మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. అతి తక్కువ ధరలోనే అదిరిపోయే స్కూటర్‌ను కొనుగోలు చేయండి. ఇంకా అందులో ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందుకోసం మీరు రూ.50 వేల కన్నా తక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తే చాలు.
Updated on: Jan 11, 2023 | 1:12 PM

మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. అతి తక్కువ ధరలోనే అదిరిపోయే స్కూటర్‌ను కొనుగోలు చేయండి. ఇంకా అందులో ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందుకోసం మీరు రూ.50 వేల కన్నా తక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తే చాలు.

కబీరా మొబిలిటీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొలిజియో నియో అందుబాటులో ధరలోనే ఉంది. ప్రత్యేకమైన డిజైన్, తక్కువ బరువుతో ఉన్న ఈ స్కూటర్ చూడటానికి అదిరే లుక్‌తో ఉంది. బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.

కబీరా మొబిలిటీ కొలిజియో నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 45,990గా ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్ రేటు. అదే ఆన్‌రోడ్ ధర విషయానికి వస్తే.. దీని రేటు రూ. 49,200 వరకు ఉంటుంది. అంటే రేటు తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 48వీ 24 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇందులో బీఎల్‌డీసీ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. దీని సామర్థ్యం 250 వాట్ పవర్. కంపెనీ బ్యాటరీ ప్యాక్‌పై ఏడాది వరకు వారంటీ కూడా ఇస్తుంది.

బ్యాటరీ చార్జింగ్ విషయానికి వస్తే.. ఫుల్ కావడానికి 4 గంటలు పడుతుంది. ఒక్కసారి బ్యాటరీని ఫుల్‌గా చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. అంటే స్పీడ్ తక్కువనే చెప్పుకోవాలి. తద్వారా చాలా సేఫ్‌టీ అని చెప్పుకోవచ్చు. అలాగే దీని రేంజ్ ఎక్కువగా ఉంది.

కబీరా మొబిలిటీ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డిస్క్ బ్రేక్ అమర్చింది. ముందు భాగంలో డిస్క్ బ్రేక్ ఉంటుంది. అదే వెనుక భాగంలో అయితే డ్రమ్ బ్రేక్ అమర్చారు. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఉందని చెప్పుకోవచ్చు. స్ప్రింగ్ టైప్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రిమోట్ స్టార్ట్, పుష్ బటన్ స్టార్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డిజిటల్ ట్రిప్ మీటర్, డిజిటల్ స్పీడో మీటర్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలారం, లైవ్ ట్రాకింగ్, ఇంటెలిజెంట్ యాంటీ థెఫ్ట్ అండ్ ఎస్ఓఎస్, ట్రిప్ హిస్టరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా ఈ స్కూటీలో మొబైల్ యాప్ ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ లైట్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ఎల్ఈడీ టర్న్ సిగ్నల్ ల్యాంప్, లో బ్యాటరీ ఇండికేటర్ వంటి ప్రత్యేకతలు కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు దీన్ని తీసుకోవచ్చు. మీకు దగ్గరిలోని కంపెనీ షోరూమ్‌కు వెళ్లి ఈ ఎలక్ట్రిక్ వెహికల్‌ను వెంటనే కొనుగోలు చేయవచ్చు.




