Auto Tips: కారు ఓనర్స్‌కు అలెర్ట్.. కార్ నుంచి ఈ రంగు పొగ వస్తే వెంటనే జాగ్రత్త పడండి.. లేకపోతే అంతే సంగతీ..!
చాలా మంది తాము అవలంభిస్తున్న బీజీ లైఫ్, జీవన శైలి కారణంగా తమ కారును సర్వీస్ చేయించడం, లేదా కారుపై దుమ్మును శుభ్రపరచడం వంటివి చేయరు. ఫలితంగా కొంత కాలానికి అవి రిపేర్ సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అంతేకాక కారు చాలా..
ప్రస్తుత కాలంలో కార్ అనేది అందరి దగ్గర ఉండే సాధారణమైన వెహికిల్‌గా మారిపోయింది. సరదాగా కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాలన్నా, ఇబ్బందిలేని ప్రయాణాలు చేయాలన్నా కూడా కారు తప్పనిసరి అనే పరిస్థితి కూడా ఈ రోజుల్లో ఉంది. అయితే చాలా మంది తాము అవలంభిస్తున్న బీజీ లైఫ్, జీవన శైలి కారణంగా తమ కారును సర్వీస్ చేయించడం, లేదా కారుపై దుమ్మును శుభ్రపరచడం వంటివి చేయరు. ఫలితంగా కొంత కాలానికి అవి రిపేర్ సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అంతేకాక కారు చాలా కాలం నడవాలంటే దాని మెయింటనెన్స్ చాలా ముఖ్యం. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఆ నేపథ్యంలోనే కొన్ని కొన్ని సార్లు కార్ రిపేర్‌ను తెలియజేసేలా దాని ఇంజిన్‌లో నుంచి పొగలు వస్తుంటాయి. అయితే ఇలా వచ్చే పొగలు వేరు వేరు రంగులలో కూడా ఉంటాయి. ఈ పొగల రంగుని బట్టి వాటి వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవచ్చు. మరి ఏ రంగు ఏ సమస్యను సూచిస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్లాక్ స్మోక్: కారు నుంచి నల్లని రంగులో పొగ వస్తే ఫ్యూయెల్ లీక్ అవుతుందని అర్థం చేసుకోండి. ఇలాంటి సందర్భంలోనే కార్ నుంచి వచ్చే పొగ నల్లగా ఉంటుంది. గాలి-ఫ్యూయెల్ నిష్పత్తిలో సమస్య కలిగినప్పుడు ఇలా జరుగుతుంది. ఇంతే కాకుండా అరిగిపోయిన నాజిల్ కారణంగా ఫ్యూయెల్ ఇంజెక్టర్ లీకేజీ జరుగుతుంది. దీనివల్ల కూడా నల్లని రంగు పొగ వస్తుంది.
నీలిరంగు పొగ: చాలా సందర్భాలలో పాత వాహనాల నుంచి బ్లూ కలర్‌లో పొగను వస్తుంది. ఈ రకమైన పొగ ఇంజిన్‌లో లోపం ఉందని సూచిస్తుంది. పిస్టన్ లేదా వాల్వ్ గైడ్ సీల్ దెబ్బతిన్న తర్వాత ఇటువంటి బ్లూ కలర్ పొగ బయటకు వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా మెకానిక్‌కి చూపించి కారును రిపెయిర్ చేయించడం మంచిది.
తెల్లటి పొగ: అలాగే కారు నుంచి కొన్ని సార్లు తెల్లటి రంగులో పొగ వస్తుంది. కారు ఇలా తెల్లటి పొగను విడుస్తుంటే అప్రమత్తంగా ఉండాలి. దాని కూలంట్ లీక్ అయినప్పుడు ఈ రకమైన పొగ వస్తుంది. కూలంట్ పని వాహనం ఇంజిన్ చల్లగా ఉంచడం. ఇది లీక్ అయితే కారు త్వరగా వేడెక్కడమే కాక ఇంజిన్ వెంటనే చెడిపోతుంది. కాబట్టి సమీపంలోని మెకానిక్ షాపునకి వెళ్లి త్వతరితంగా సరిచేసుకోవాలి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం