Set Top Box: సెట్ అప్ బాక్స్ లేకుండా టీవీల్లో ఆ చానల్స్.. సంచలన ఆదేశాలిచ్చిన కేంద్రం..
ప్రస్తుతం భారత్ లో టీవీ ప్రేక్షకులు వివిధ చెల్లింపు పద్ధతులను పాటించి ఫ్రీ టు ఎయిర్ చానల్స్ ను కూడా వీక్షిస్తున్నారు. ఇలా చూడాలంటే కచ్చితంగా సెట్ అప్ బాక్స్ కూడా కొనాల్సి వస్తుంది. దూరదర్శన్ ద్వారా ప్రసారం చేసే ఫ్రీటు ఎయిర్ చానల్స్ ను కూడా వీక్షకుడు సెట్ అప్ బాక్స్ ఉంటే చూడగలడు. ప్రస్తుతం దూరదర్శన్ అన్ లాగ్ ట్రాన్సిమిషన్ తొలగించే పనిలో ఉంది.
భారత ప్రభుత్వం ఇటీవల కొత్త ఆదేశాలను అమల్లోకి తీసుకువచ్చింది. ఇకపై ఇండియాలో వచ్చే డిజిటల్ టెలివిజన్ రిసీవర్లు, టైప్ సీ చార్జర్లు, వీడియో సర్వలెన్స్ సిస్టమ్స్ ఈ మూడు ప్రొడెక్ట్స్ లో నాణ్యత ప్రమాణాలు ఉండాల్సిందేనని, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నియమాలకు అనుగుణంగా వాటి తయారీ ఉండాలని పేర్కొంది. ఈ ఆదేశాల్లో గమనించాల్సిన విషయం ఏంటంటే ఇకపై భారత్ లో విడుదల చేసే టీవీల్లో కచ్చితంగా అంతర్నిర్మిత శాటిలైట్ ట్యూనర్లను అమర్చాలని పేర్కొంది. అది కూడా ఐఎస్ ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని వివరించింది. ప్రస్తుతం భారత్ లో టీవీ ప్రేక్షకులు వివిధ చెల్లింపు పద్ధతులను పాటించి ఫ్రీ టు ఎయిర్ చానల్స్ ను కూడా వీక్షిస్తున్నారు. ఇలా చూడాలంటే కచ్చితంగా సెట్ అప్ బాక్స్ కూడా కొనాల్సి వస్తుంది. దూరదర్శన్ ద్వారా ప్రసారం చేసే ఫ్రీటు ఎయిర్ చానల్స్ ను కూడా వీక్షకుడు సెట్ అప్ బాక్స్ ఉంటే చూడగలడు. ప్రస్తుతం దూరదర్శన్ అన్ లాగ్ ట్రాన్సిమిషన్ తొలగించే పనిలో ఉంది. ఇది పూర్తయితే దూరదర్శన్ ద్వారా కూడా డిజిటల్ ట్రాన్స్ మిషన్ ద్వారా ఫ్రీ టు ఎయిర్ చానల్స్ ప్రసారం చేస్తారు. కాబట్టి భవిష్యత్ అవసరాలను దృష్టి పెట్టుకుని భారత్ లో తయారయ్యే అన్ని టీవీల్లో కచ్చితంగా బీఎస్ఐ స్టాండర్డ్స్ కు అనుగుణంగా శాటిలైట్ ట్యూనర్స్ ను అమర్చాలని టీవీ కంపెనీలను కేంద్రం ఆదేశించింది.
చార్జర్ల సంఖ్య తగ్గించే యోచన
ప్రస్తుతం అన్ని ఫోన్లలో టైప్ సీ ఆధారిత చార్జింగ్ సిస్టమ్స్ తో వస్తున్నాయి. కాబట్టి ఫోన్ మార్చిన ప్రతిసారి చార్జర్ కొనాల్సిన పరిస్థితి లేదు. కానీ, విచ్చలవిడిగా చార్జర్స్ ఇవ్వడంతో ఈ-వేస్ట్ కూడా గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి ఫోన్ కంపెనీలు, అలాగే చార్జర్ కంపెనీలు కూడా ఇకపై బీఎస్ఐ స్టాండర్డ్స్ అనుగుణంగానే టైప్ సీ చార్జర్లను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తే ప్రతి ఇంట్లో చార్జర్ల సంఖ్య తగ్గిపోతుంది.
మరింత మెరుగ్గా సీసీ కెమెరా ప్రొడక్ట్స్
సెక్యూరిటీ పరంగా అప్ డేట్ గా ఉండేందుకు, అలాగే రక్షణ కోసం ప్రజలు విరివిగా సీసీ కెమెరాలు వాడుతున్నారు. మార్కెట్ వివిధ రకాలైన సీసీ కెమెరాలు అందుబాటులో ఉండడంతో ఏ సిస్టమ్ తీసుకోవాలో? తెలియక వినియోగదారులు తికమకపడుతున్నారు. తక్కువ ధరల్లో ఉన్న వీఎస్ఎస్ ను తీసుకుంటే ఏదైనా చోరీ జరిగిన సందర్భంగా నిందితులను గుర్తించడం కష్టసాధ్యంగా ఉంటుంది. సెక్యూరిటీ పరంగా నాణ్యమైన ఫీడ్ ను వినియోగదారులకు అందించాలి కాబట్టి ఇకపై వీఎస్ఎస్ తయారీ దారులు కూడా కచ్చితంగా బీఎస్ఐ నియామాలను పాటించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను అందరూ పాటిస్తే నిఘా వ్యవస్త మరింత పటిష్టంగా ఉంటుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం