AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Love Story: ఫేస్‌బుక్‌ ప్రేమ.. ప్రియుడితో పెళ్లి కోసం పెళ్లి బట్టలు, నగలతో సైకిల్‌పై 1600కి. మీ ప్రయాణం.. కానీ మధ్యలోనే

యూపీకి చెందిన యువతికి సూరత్‌కు చెందిన యువకుడితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల చాటింగ్ తర్వాత.. ఆ అబ్బాయిని కలవాలనుకుంటున్నట్లు తన  కోరికను బయటపెట్టింది. యువకుడు తాను యువతి గ్రామానికి రాలేనని చెప్పాడు. దీంతో యువతి నగలు, పెళ్లి కోసం బట్టలు పట్టుకుని స్వయంగా సైకిల్‌పై అతడిని కలవడానికి బయలుదేరింది.

Unique Love Story: ఫేస్‌బుక్‌ ప్రేమ.. ప్రియుడితో పెళ్లి కోసం పెళ్లి బట్టలు, నగలతో సైకిల్‌పై 1600కి. మీ ప్రయాణం.. కానీ మధ్యలోనే
Unique Love Story
Surya Kala
|

Updated on: Jan 20, 2023 | 5:12 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌లో ఓ యువకుడికి తో 24 ఏళ్ల యువతికి పరిచయం ఏర్పడింది. అనంతరం ప్రేమగా మారింది. దీంతో తన ప్రియుడిని కలవడం కోసం.. పెళ్లి చేసుకోవాలని భావించింది. తన ఊరు నుంచి 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రియుడు ఊరు సూరత్‌కు సైకిల్ మీద పయనం అయింది ఆ యువతి. అయితే మార్గమధ్యంలో యువతి చేసిన పొరపాటు కారణంగా పోలీసులకు పట్టుబడింది. దీంతో ఆమెను తిరిగి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మీడియా కథనాల ప్రకారం..  యువతి బల్లియా జిల్లాలోని మనియార్ గ్రామ నివాసి. ప్రియుడిని కలిసేందుకు సూరత్ వెళ్లేందుకు మంగళవారం సైకిల్‌పై బయలుదేరింది. అయితే ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న షకన్‌పూర్ మార్కెట్‌కు చేరుకుంది. అక్కడ ఉన్న కొందరు వ్యాపారులు యువతి తీరుపై అనుమానం వచ్చింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే యువతిని చేరుకున్నారు. ఆమె తల్లిదండ్రులను సంప్రదించారు. యువతి బ్యాగులో నుంచి పెళ్ళికి కావాలిన బట్టలు, వధువు దుస్తులు, నగలు స్వాధీనం చేసుకున్నారు. తమ కూతురు మానసిక పరిస్థితి బాగా లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

ఇదే విషయంపై అధికారి రాజ్‌కపూర్ సింగ్ మాట్లాడుతూ..  “మంగళవారం, శంకర్‌పూర్ మార్కెట్‌లోని కొంతమంది వ్యాపారులు ఓ యువతి ఇంటి నుండి పారిపోయే వచ్చినట్లు తమకు అనుమానము కలుగుతుందని పోలీసులకు చెప్పినట్లు చెప్పారు. వెంటనే ముందు ఆ యువతిని విచారించి.. ఆపై ఆమె తల్లిదండ్రులకు అప్పగించామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఆ యువతి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు యువతి చాలా ప్రయత్నించింది. పరీక్ష రాసేందుకు ప్రయాగ్‌రాజ్‌కి వెళ్తున్నానని మొదట చెప్పింది. పోలీసులు అనేక రకాలుగా ప్రశ్నిస్తే.. అప్పుడు చివరకు తాను సూరత్ లో ఉన్న తన ప్రేమికుడిని కలవడానికి వెళ్తున్నట్లు చెప్పింది.

యూపీకి చెందిన యువతికి సూరత్‌కు చెందిన యువకుడితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల చాటింగ్ తర్వాత.. ఆ అబ్బాయిని కలవాలనుకుంటున్నట్లు తన  కోరికను బయటపెట్టింది. యువకుడు తాను యువతి గ్రామానికి రాలేనని చెప్పాడు. దీంతో యువతి నగలు, పెళ్లి కోసం బట్టలు పట్టుకుని స్వయంగా సైకిల్‌పై అతడిని కలవడానికి బయలుదేరింది. శంకర్‌పూర్ మార్కెట్‌కు చేరుకున్నప్పుడు..  ఆమె మొబైల్ ఫోన్ బ్యాటరీ అయిపోయింది. ఇక్కడ ఫోన్ ఛార్జింగ్‌ పెట్టుకుంటానని కొంతమంది దుకాణదారులను అఅడిగింది. దీంతో అమ్మాయి తీరుపై అనుమానం వచ్చిన వ్యాపారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..