AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యాపారి కేసులో మరో ఝలక్‌.. ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా..

ఆ తర్వాత, శంకర్ మిశ్రా అతను ఉద్యోగం చేస్తున్న వెల్స్ ఫార్గో కంపెనీ అతన్ని ఉద్యోగంలోంచి తొలగించింది.. శంకర్ మిశ్రా అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గోలో భారత వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ విషయంపై

Air India: మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యాపారి కేసులో మరో ఝలక్‌.. ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా..
Twist In Air India
Jyothi Gadda
|

Updated on: Jan 20, 2023 | 5:18 PM

Share

బెంగళూరు: ఎయిరిండియా విమానంలో వృద్ధురాలిపై వ్యాపారవేత్త మూత్ర విసర్జన చేసిన కేసులో ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రూ.30 లక్షల జరిమానా విధించింది. ఫ్లైట్ కమాండర్‌ను సస్పెండ్ చేయడంతోపాటు ఎయిర్ ఇండియాకు జరిమానా విధించారు. గతేడాది నవంబర్‌ 26న న్యూయార్క్‌ నుంచి భారత్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో పక్కనే కూర్చున్న మహిళపై వ్యాపారవేత్త శంకర్‌ మిశ్రా మూత్ర విసర్జన చేశాడని ఆరోపించింది బాధిత వృద్ధురాలు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన ఎయిరిండియా మిశ్రాపై 4 నెలల పాటు విమాన ప్రయాణాన్ని నిషేధించగా.. ఇదే కేసులో ఢిల్లీ కోర్టు మిశ్రాకు బెయిల్ నిరాకరించింది. అంతకుముందు, ఒక నెల విమాన నిషేధం విధించబడింది. దానిని నాలుగు నెలలకు పొడిగించారు.

గతంలో కేసు నమోదు కాగానే శంకర్ మిశ్రా పరారీలో ఉన్నాడు. అయితే అతడు బెంగుళూరులో ఉన్నాడని సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసులు ఓ టీమ్‌గా ఏర్పడి బెంగళూరు వచ్చి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత, శంకర్ మిశ్రా అతను ఉద్యోగం చేస్తున్న వెల్స్ ఫార్గో కంపెనీ అతన్ని ఉద్యోగంలోంచి తొలగించింది.. శంకర్ మిశ్రా అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గోలో భారత వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ విషయంపై ప్రెస్ కేసును విడుదల చేసిన వెల్స్ ఫార్గో.. క్రమశిక్షణ నిబంధనలు ఉల్లంఘించే ఉద్యోగులతో కంపెనీలో కొనసాగలేమని చెప్పారు.

ఎయిర్ ఇండియా విమానంలో ఓ మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటనను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు అతనిపై చర్యలకు డిమాండ్‌ చేసింది. మిశ్రా అరెస్ట్ తర్వాత విచారణ సందర్భంగా శంకర్ మిశ్రా కోర్టు ముందు కొత్త వాంగ్మూలం ఇచ్చారు. అతను మూత్ర విసర్జన చేయలేదని, ఆ మహిళ మూత్ర విసర్జన చేసుకుందని, తనను దూషించిందని చెప్పాడు. ఈ మేరకు ఢిల్లీ సెషన్స్ కోర్టులో శంకర్ మిశ్రా వాంగ్మూలం ఇచ్చారు. విమానంలో మహిళలకు సీట్లు పరిమితం. స్త్రీకి ఆరోగ్య సమస్య ఉంది. ఆమె కథక్ నృత్యకారిణి. శంకర్ మిశ్రా తరపు న్యాయవాది వాదిస్తూ కథక్ డ్యాన్సర్లలో 80 శాతం మందికి ఆపుకొనలేని సమస్యలు ఉన్నాయి. ఈ వాదన మొత్తం కేసుకు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. అయితే ఇదంతా అబద్ధమని, తనను తాను రక్షించుకునేందుకు శంకర్ మిశ్రా అబద్ధాలు చెబుతున్నాడని ఆ మహిళ ఆరోపించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..