Watch Video: ఫంక్షన్‌లో పాడు పని.. పిండిలో ఉమ్మివేస్తూ చపాతీలు.. వెంటనే అరెస్ట్.. ఆ తర్వాత
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. జనవరి 18 న తిలా మోర్ పోలీస్ స్టేషన్‌లో ఆ వ్యక్తిపై పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో జంతువులు, పక్షులు, పాములకు సంబంధించిన విచిత్రలే కాదు.. మనుషులు చేసే చిత్రాలు, దారుణాలు కూడా ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషి చేసే ఘోరమైన తప్పులు, వెకిలి చేష్టలకు సంబంధించిన వీడియోలు నెటిజన్ల కంటబడుతుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి చేసిన నీచమైన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక హోటల్‌లో పనిచేస్తున్న వ్యక్తి ఉమ్మి వేసి చపాతీలు తయారు చేస్తున్నాడు. ఈ వీడియో ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందినదిగా గుర్తించారు పోలీసులు.. వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. అలాంటి వీడియో ఒకటి తిలా మోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతం నుండి విడుదలైంది. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల తీవ్ర ఆగ్రహానికి కారణమవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఘజియాబాద్ పోలీసులు నిందితుడిని తసీరుద్దీన్‌గా గుర్తించి జనవరి 19 ఉదయం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిపై చట్టపరమైన విచారణ కొనసాగుతోంది. మార్చి 2021లో, నిశ్చితార్థ వేడుకలో ఉమ్మివేస్తూ రోటీలు చేస్తున్న వీడియో వైరల్ కావడంతో ఘజియాబాద్ పోలీసులు మహ్మద్ మొహ్సిన్‌ను అరెస్టు చేశారు. రోటీల కోసం తయారు చేసిన పిండిపై ఉమ్మివేస్తూ వంట మనిషి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దౌసా బంజర్‌పూర్ సమీపంలోని ఒక విద్యా సంస్థ ప్రాంగణంలో శివకుమార్ మేనల్లుడు నిశ్చితార్థ వేడుక సందర్భంగా ఈ సంఘటన జరిగింది. వీడియో వైరల్ కావడంతో మహ్మద్ ఖాలిక్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
#Ghaziabad: #Man spits on #chapati before #cooking | Accused Mohsin is arrested. #journalist #AnuragSason #News #crime #roti pic.twitter.com/nxeVfL01Fm
— Journalist Anurag K Sason (@AnuragSason) March 14, 2021
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇలాంటి ఘటనే తాజాగా మరో మారు జరిగినట్టుగా సమాచారం. జరిగిన ఘటనపై జనవరి 18 న తిలా మోర్ పోలీస్ స్టేషన్‌లో ఆ వ్యక్తిపై పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు 24గంటల్లోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, 2021 సంఘట దృశ్యాలు మాత్రం ఇంటర్ నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్ల కళ్లు బైర్లు కమ్మాయి. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మండిపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..