White Pumpkin Benefits: తెల్ల గుమ్మడికాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

ఈ సమస్య నుండి బయటపడాలంటే ప్రతి రోజూ ఉదయం ఈ గుమ్మడికాయ రసాన్ని తాగండి. మీరు కొన్ని రోజుల్లో కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు.

White Pumpkin Benefits: తెల్ల గుమ్మడికాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
White Pumpkin
Follow us

|

Updated on: Jan 20, 2023 | 3:43 PM

మీరెప్పుడైనా తెల్ల గుమ్మడికాయను చూశారా..? కానీ, ఈ తెల్లగుమ్మడికాయ మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ముఖ్యంగా తెల్ల గుమ్మడి రసం ఆరోగ్యానికి దివ్యౌషధంలా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రసిద్ధ దక్షిణ భారత వంటకాలు, సాంబార్‌లలో గుమ్మడికాయను ఎక్కువగా వాడుతుంటారు. కానీ, తెల్ల గుమ్మడికాయ గురించి మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. దిన్నీ మీరు ఇంకా తినకపోతే, ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. గుమ్మడికాయలు తెలుపు, పసుపు రంగులో ఉంటాయి. తెల్లని గుమ్మడికాయలో ఐరన్‌, భాస్వరం, మెగ్నీషియం, నియాసిన్, థయామిన్ మరియు ఫోలేట్ వంటి ఖనిజాలు లభిస్తాయి.

తెల్ల గుమ్మడికాయలో చాలా రకాల విటమిన్లు ఉంటాయి. కావున శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఇందులో ఐరన్, ఫాస్పరస్ అధిక పరిమాణంలో ఉంటాయి. ఇది శరీరంలో ఉన్న కాలేయం సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా తెల్ల గుమ్మడితో చేసిన రసం వల్ల శరీరానికి వచ్చే చాలా రకాల ప్రయోజనాల గురించి ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. ఈ రసం తాగడం వల్ల కాలేయ సమస్యలు తొలగిపోతాయని వారు చెబుతున్నారు. ఇది శరీర సమస్యలకు దివ్యౌషధంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా బాధితులు రోజూ తీసుకునే ఆహారంలో తెల్ల గుమ్మడికాయను చేర్చుకోవాలి. ఈ కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శ్వాసకోశ వ్యవస్థలో సంక్రమణను తగ్గించడంలో సహాయపడుతుంది.

తెల్ల గుమ్మడికాయలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రే చీకటితో బాధపడేవారికి ఇది ఉపశమనాన్ని కలిగిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి తెల్ల గుమ్మడికాయ ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే ప్రతి రోజూ ఉదయం ఈ గుమ్మడికాయ రసాన్ని తాగండి. మీరు కొన్ని రోజుల్లో కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు.

ఇవి కూడా చదవండి

కడుపులో మంట, ఛాతీలో మంట,కాలేయంలో వేడి పెరిగినప్పుడు వంటి సమస్యల నుంచి విముక్తి పొందేందుకు తెల్ల గుమ్మడికాయ రసం తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మెదడుకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు.. మైగ్రేన్ పేషెంట్లుగా మారిన వారు తప్పకుండా తెల్ల గుమ్మడికాయ రసం తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రసాన్ని క్రమం తప్పకుండా ఖాళీ కడుపుతో తాగుతూ ఉంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… తక్కువ వడ్డీకే రుణాలు
వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… తక్కువ వడ్డీకే రుణాలు
పెరుగుతో బెల్లం కలిపి తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..?
పెరుగుతో బెల్లం కలిపి తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..?
తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత పోస్ట్
తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత పోస్ట్
కీలక నిర్ణయం.. ఉబెర్‌ నుంచి ట్యాక్సీలే కాదు ఇక బస్సులు కూడా..
కీలక నిర్ణయం.. ఉబెర్‌ నుంచి ట్యాక్సీలే కాదు ఇక బస్సులు కూడా..
ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్‌ ప్రమాదం వెనక ఎవరి హస్తం ఉంది?
ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్‌ ప్రమాదం వెనక ఎవరి హస్తం ఉంది?
శ్రీశైలంలో ఉక్కపోత నుంచి ఉపశమనం.. దంచికొట్టిన వర్షం..
శ్రీశైలంలో ఉక్కపోత నుంచి ఉపశమనం.. దంచికొట్టిన వర్షం..
ఆపద వేళ ఆపన్న హస్తం.. ఆ యాప్ ద్వారా అంబులెన్స్ బుకింగ్స్ షురూ
ఆపద వేళ ఆపన్న హస్తం.. ఆ యాప్ ద్వారా అంబులెన్స్ బుకింగ్స్ షురూ
సూపర్ రీచార్జ్‌ ప్లాన్‌ ప్రకటించిన వీఐ..రూ.1కే బోలెడు లాభాలు
సూపర్ రీచార్జ్‌ ప్లాన్‌ ప్రకటించిన వీఐ..రూ.1కే బోలెడు లాభాలు