Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని నీళ్లలో మరిగించి తాగి చూడండి.. వారం రోజుల్లో బరువు తగ్గుతారు..

నీటిలో ఉడకబెట్టడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో, బ్లడ్ షుగర్ అదుపులో ఉంచడంలో చాలా సహాయపడుతుంది.

Weight Loss Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని నీళ్లలో మరిగించి తాగి చూడండి.. వారం రోజుల్లో బరువు తగ్గుతారు..
Boiled Fennel In Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 19, 2023 | 9:59 PM

మనమందరం సోంపును నమలడానికి ఇష్టపడతాము. ఇది భోజనం తర్వాత స్వీట్‌ తినాలనే కోరికను తగ్గిస్తుంది. అలాగే ఆహారాన్ని జీర్ణం చేయడంలో, కడుపు సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. చాలా మంది భోజనం తర్వాత ఫెన్నెల్ టీ తాగడానికి ఇష్టపడతారు. మరికొందరు ఉదయం ఖాళీ కడుపుతో రాత్రిపూట నీటిలో నానబెట్టిన సోంపును తిని మరుసటి రోజు తాగడానికి ఇష్టపడతారు. అయితే సొంపు గింజలను నీటిలో వేసి మరిగించి దాని నీటిని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందని మీకు తెలుసా..? సొంపును నీళ్లలో మరిగించి తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

సొంపును నీళ్లలో మరిగించి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతాయి – సోంపును నీటిలో ఉడకబెట్టడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో, బ్లడ్ షుగర్ అదుపులో ఉంచడంలో చాలా సహాయపడుతుంది. ఫెన్నెల్ టీ, దాని నీరు, లేదంటే నేరుగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

శరీరంలో హైడ్రేషన్‌ను ప్రోత్సహిస్తుంది- తగినంత నీళ్లు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల వాంతులు, విరేచనాలు, తల తిరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి. అటువంటి పరిస్థితిలో, ఫెన్నెల్ సీడ్ వాటర్ తాగడం ద్వారా శరీరంలోని డీహైడ్రేషన్ సమస్య తొలగిపోతుంది. ఈ విధంగా, అలసట పోతుంది.

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది మీరు బరువు తగ్గాలనుకుంటే, గొప్ప డిటాక్స్ డ్రింక్ కోసం చూస్తున్నట్లయితే, మీరు సోంపు గింజలను నీటిలో ఉడకబెట్టి తాగవచ్చు. తరచూ ఇలా చేయటం వల్ల మీరు త్వరగా బరువు తగ్గుతారు.

జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది- కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు సొంపు గింజలను నీటిలో వేసి మరిగించి తాగాలి.. ఇలా చేయడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..