Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayurvedic Tea: తలనొప్పి వేధిస్తోందా.. తరచూ మందులు వేసుకుంటున్నారా.. ఒక్కసారి ఈ టీ ట్రై చేయండి..

తలనొప్పి అనేది చాలా సాధారణ సమస్య. ఇది అందరికీ వస్తుంది. కొద్ది సమయంలో ఇది తగ్గిపోతుంది. కానీ కొంత మందికి మాత్రం ఎక్కువ సమయం వేధిస్తుంది. తేలికపాటి తలనొప్పి వచ్చిన వెంటనే స్ట్రాంగ్ కాఫీ లేదా స్ట్రాంగ్ టీ...

Ayurvedic Tea: తలనొప్పి వేధిస్తోందా.. తరచూ మందులు వేసుకుంటున్నారా.. ఒక్కసారి ఈ టీ ట్రై చేయండి..
Ayurvedic Tea
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 19, 2023 | 9:55 PM

తలనొప్పి అనేది చాలా సాధారణ సమస్య. ఇది అందరికీ వస్తుంది. కొద్ది సమయంలో ఇది తగ్గిపోతుంది. కానీ కొంత మందికి మాత్రం ఎక్కువ సమయం వేధిస్తుంది. తేలికపాటి తలనొప్పి వచ్చిన వెంటనే స్ట్రాంగ్ కాఫీ లేదా స్ట్రాంగ్ టీ తాగితే తగ్గుతుందనే విషయం మనకు తెలిసిందే. కొన్నిసార్లు ఒత్తిడిని తగ్గించుకోవడానికి టీ తీసుకుంటారు. మైగ్రేన్ సమస్య త్వరగా తగ్గదు. ఇది చాలా ప్రభావితం చేస్తుంది. స్త్రీలలో తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. అయితే తలనొప్పికి సాధారణ టీలతో కాకుండా ఆయుర్వేద టీ లతో చెక్ పెట్టాలంటున్నారు నిపుణులు. మెదడు, కళ్లు, చెవులు ముక్కులోని నరాల సమస్యల వల్ల కూడా ఇది సంభవించవచ్చు. చాలా మంది తలనొప్పి సమస్య పెరిగినప్పుడు మాత్రలు వేసుకుంటారు. కానీ ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతుంది. అందుకు బదులుగా తలనొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం ఇంట్లో ఆయుర్వేద టీని తయారు చేసి, తాగాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఒక గ్లాసు నీరు, అర టీస్పూన్ అజ్వైన్, ఒక ఇలాచి, ఒక టీస్పూన్ కొత్తిమీర గింజలు, ఐదు పుదీనా ఆకులు లను ఒక గిన్నెలో ఉంచాలి. మీడియం మంట మీద 3 నిమిషాలు మరిగించాలి. తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి తాగాలి. తలనొప్పిగా ఉన్నప్పుడు ఉదయాన్నే ఈ టీ తాగితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మైగ్రేన్ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, హ్యాంగోవర్లు, అనియంత్రిత మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత, వాపు, ఆహార కోరికలు, వ్యసనాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించడం, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఈ టీ ఉపయోగపడుతుంది. ఈ ఆయుర్వేద టీని క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

భాస్వరం, కెరోటిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, థయామిన్ మరియు కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. వాపు, అజీర్ణం, దగ్గు, జలుబు, మధుమేహం, ఉబ్బసం, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..