‘ఆ పోలీసుల బట్టలూడదీస్తా‘.. హోంమంత్రి అయ్యాక షూట్‌ ఎట్‌ సైటే.. అయ్యన్న సంచలన కామెంట్స్..

పోలీసులపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్న పోలీసులకు తాను హోంమంత్రి అయ్యాక షూట్‌ ఎట్‌ సైటేనని వ్యాఖ్యానించారు.

‘ఆ పోలీసుల బట్టలూడదీస్తా‘.. హోంమంత్రి అయ్యాక షూట్‌ ఎట్‌ సైటే.. అయ్యన్న సంచలన కామెంట్స్..
Ayyanna Patrudu
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 19, 2023 | 2:01 PM

పోలీసులపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్న పోలీసులకు తాను హోంమంత్రి అయ్యాక షూట్‌ ఎట్‌ సైటేనని వ్యాఖ్యానించారు. తనకు హోంమంత్రితోపాటు లా అండ్‌ ఆర్డర్‌ కూడా ఇస్తే పోలీసుల సంగతి చూసుకుంటానని పరుష పదజాలంతో హెచ్చరించారు. నిన్న రాత్రి తాడికొండలో జరిగిన పార్టీ మీటింగ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వగా.. ఇప్పుడు తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు అయ్యన్నపాత్రుడు. లా అండ్‌ ఆర్డర్‌ ఇస్తే ఐపీఎస్‌ ల బట్టలు ఊడదీస్తామని వ్యాఖ్యానించారు. లా అండ్‌ ఆర్డర్‌ ఇస్తే షూట్‌ ఎట్‌ సైటేనని మరోసారి వ్యాఖ్యానించారు.

‘వైసీపీ నేతల అండ చూసుకుని ఇప్పుడు పోలీసులు ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో… వారి లిస్ట్‌ అంతా రాసుకుంటా.. నేను హోంమంత్రి అయ్యాక వారి(పరుష పదజాలం) సంగతి చూస్తా. నేను హోంమంత్రి అయ్యాక వారికి షూట్‌ ఎట్‌ సైటే. మరో 8 నెలల్లో చంద్రబాబు సీఎం అవడం ఖాయం. అధికారం టీడీపీకి వస్తుంది. ఈ దౌర్భాగ్యులంతా జైలుకు వెళతారు. అప్పుడు ఈ పోలీసులు మా చెంతకే(పరుష పదజాలం) రావాలి.’ అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అయ్యన్న.

అయితే, అయ్యన్న నోటి దురుసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాంధ్ర ఎటకారాన్ని జోడించి.. ఆయన మాట్లాడిన మాటలు ఎలాంటి టర్న్‌ తీసుకుంటాయోనని అంతా చర్చించుకుంటున్నారు. ఆయన ఏకంగా ఐపీఎస్‌లను కూడా వదలకుండా విమర్శించారు. దీనికి పోలీస్‌ సంఘాల రియాక్షన్ ఎలా ఉండబోతోంది.. చూడాలి మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..