PM Modi in Karnataka: ‘ఓట్‌ బ్యాంక్‌ రాజకీయాలు కాదు- అభివృద్దే బీజేపీ ఏజెండా’.. కన్నడీగులను కదిలించేలా ప్రధాని మోదీ ప్రసంగం

శివలీల గోపి తుల్వా

శివలీల గోపి తుల్వా | Edited By: Janardhan Veluru

Updated on: Jan 19, 2023 | 2:32 PM

‘ఓటుబ్యాంక్‌ రాజకీయాలు బీజేపీ నైజం కాదు..అభివృద్దే మా ఏజెండా’ అని కర్ణాటక పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.  అంతేకాక వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం..

PM Modi in Karnataka: ‘ఓట్‌ బ్యాంక్‌ రాజకీయాలు కాదు- అభివృద్దే బీజేపీ ఏజెండా’.. కన్నడీగులను కదిలించేలా ప్రధాని మోదీ ప్రసంగం
Pm Modi Speech In Karnataka Yadgiri District

‘ఓటుబ్యాంక్‌ రాజకీయాలు బీజేపీ నైజం కాదు..అభివృద్దే మా ఏజెండా’ అని కర్ణాటక పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.  అంతేకాక వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం మద్ధతునిస్తుందన్నారు మోదీ. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు(జనవరి 19) పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగానే కర్ణాటకలోని యాదగిరి, కలబురగి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించారు. యాదగిరిలోని కోడెగాలో జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టుతో పాటు, సాగునీరు, తాగునీటికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించారు ప్రధాని. జల్ జీవన్ మిషన్ కింద బహుళ గ్రామాల తాగునీటి సరఫరా పథకంతో పాటు యాదగిరిలో నారాయణపూర్ ఎడమ గట్టు కాలువ పొడిగింపు, పునరుద్ధరణ, ఆధునీకరణ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు.

అయితే కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా యాదగిరి జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మోదీ ప్రసంగాన్ని వినేందుకు సమీప ప్రాంతాలలో ఉన్న బంజారా వర్గీయులు, ముఖ్యంగా మహిళలు తండోపతండాలుగా తరలివచ్చారు.

ఇవి కూడా చదవండి

 ఇక ఈ సభలో కీలకంగా ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. పలు అంశాలపై మాట్లాడిన మోదీ సభకు వచ్చిన కన్నడీగులలో నూతనోత్సహాన్ని పుట్టించారు.

మోదీ ప్రసంగంలో కీలకాంశాలు:

  1. ‘మా(బీజేపీ) పార్టీ ప్రాధాన్యత ఓటు బ్యాంకు కాదు.. అభివృద్ధి మాత్రమే. అభివృద్ధి జరగని ప్రాంతాలుగా గత ప్రభుత్వం ప్రకటించిన ప్రదేశాలలో మేము అభివృద్ధిని ప్రోత్సహించాము. యాదగిరితో పాటు భారతదేశంలోని 100కి పైగా నగరాల్లో ‘ఆకాన్షి జిల్లా’ కార్యక్రమాన్ని ప్రారంభించి, సుపరిపాలనపై దృష్టి సారించి వాటి అభివృద్ధికి కృషి చేశాం’.
  2. ‘సరిహద్దు, తీర, అంతర్గత భద్రతలతో పాటు నీటి భద్రతకు సంబంధించిన సమస్యలను మనం పరిష్కరించాలి. మా డబుల్-ఇంజిన్ ప్రభుత్వం సౌలభ్యం తీసుకురావడం, సంరక్షించడం అనే ఆలోచన ప్రక్రియతో పాటు ఆ దిశగా కృషి చేస్తోంది. భూగర్భ జలాలను కూడా పెద్ద ఎత్తున పెంచేందుకు పాటు పడుతోంది’.
  3. ‘మూడున్నర సంవత్సరాల క్రితం జల్ జీవన్ మిషన్ ప్రారంభించినప్పుడు, 18 కోట్ల గ్రామీణ కుటుంబాలలో కేవలం 3 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్ ఉంది. నేడు దేశంలో దాదాపు 11 కోట్ల గ్రామీణ కుటుంబాలు కుళాయి నీటిని పొందుతున్నాయి’.
  4. ‘ప్రతి నీటి చుక్కకు ప్రాధాన్యత ఇస్తుంది బీజేపీ. ఈ రోజుల్లో దేశంలో అధిక పంట, సూక్ష్మ నీటిపారుదల ఉంది. గత 6-7 ఏళ్లలో 70 లక్షల హెక్టార్ల భూమి మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి వచ్చింది’.
  5. ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే రాష్ట్రానికి రెట్టింపు ప్రయోజనం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ. 6,000 చెల్లిస్తే, వారికి రెట్టింపు ప్రయోజనం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం దానిలో ₹ 4,000 జోడిస్తుంది’.
  6. ‘స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటిన తర్వాత కూడా దేశంలో వెనుకబడిన ప్రాంతాలకు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇది మా మార్గం, తీర్మానం, పనితీరులోని మంత్రం. కోట్లాది మంది సన్నకారు రైతులు దశాబ్దాలుగా అన్ని సౌకర్యాలు కోల్పోయారు. వాటిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ బీజేపీ పాలనలో అలాంటి పరిస్థితి ఉండబోదు’.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu