New Zealand PM: న్యూజిలాండ్ ప్రధాని అనూహ్య నిర్ణయం.. పదవికి రాజీనామా ప్రకటించిన జసిండా ఆర్డెర్న్..

న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 2017లో న్యూజిలాండ్ ప్రధానిగా ఎన్నికయిన ఆర్డెర్న్.. ఈ ఏడాది అక్టోబర్‌లో

New Zealand PM: న్యూజిలాండ్ ప్రధాని అనూహ్య నిర్ణయం.. పదవికి రాజీనామా ప్రకటించిన జసిండా ఆర్డెర్న్..
New Zealand's Pm Jacinda Ardern Announces Her Resignation
Follow us

|

Updated on: Jan 19, 2023 | 12:54 PM

న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 2017లో న్యూజిలాండ్ ప్రధానిగా ఎన్నికయిన ఆర్డెర్న్.. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న ఎన్నికలలో పోటీ చేయాలని తాను కోరుకోవడం లేదని కూడా ప్రకటించారు. ఈ మేరకు జసిండా ఆర్డెర్న్  గురువారం(భారత కాలమానం ప్రకారం) తన నిర్ణయాన్ని స్వయంగా ప్రకటించారు. అంతేకాక తాను తన బాధ్యతలకు న్యాయం చేయలేనని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కన్నీళ్లను దిగమింగుకుంటూ తన నిర్ణయాన్ని అధికార లేబర్ పార్టీ సభ్యులకు తెలియజేశారు జసిండా.

ప్రధానిగా ఉన్నఈ ఐదున్నరేళ్లు తనకు క్లిష్టమైన సమయంగా పేర్కొన్న జసిండా.. ‘నా నిర్ణయంపై పెద్ద చర్చ జరుగుతుందని తెలుసు. కష్టంగా ఉన్నందుకు నేను రాజీనామా చేసి వెళ్లడం లేదు. అదే కారణం అయి ఉంటే ప్రధాని పదవిని చేజిక్కించుకున్న రెండు నెలల్లోనే తప్పుకునేదాన్ని. ఆరేళ్ల కాలంలో ఎన్నో పెద్ద సవాళ్లను ఎదుర్కొన్న నేను కూడా మనిషినే. రాజకీయ నాయకులు కూడా మనుషులే. మనం పని చేయగలిగినంత కాలమే కొనసాగాలి. ఆ తర్వాత సమయం వస్తుంది. ఇప్పుడు నాకు సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ ఈ పదవికి సరైన న్యాయం చేసేందుకు కావాల్సిన శక్తి నాలో తగ్గిపోయిందని ఇప్పుడు నాకు అనిపించింది’ అని జెసిండా చెప్పారు.

ఇవి కూడా చదవండి

అయితే అక్టోబర్ నెలలో జరగబోయే ఎన్నికల వరకు తాను ఎంపీగా కొనసాగుతానని జసిండా అన్నారు. ఈ నేపథ్యంలో లేబర్ పార్టీ వచ్చే ఆదివారం భేటీని ఏర్పాటు చేసి కొత్త నేతను ప్రధాని పదవికి ఎన్నుకోనుంది. ఈ ఏడాది అక్టోబర్ 14 సాధారణ ఎన్నికల వరకు కొత్తగా ఎన్నికయ్యే వ్యక్తి ప్రధాని పదవిలో ఉంటారు. జసిండా ఫిబ్రవరి 7 లోపు పదవి నుంచి తప్పుకుంటారు. కాగా జసిండా అనూహ్య నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.