Onions: కన్నీళ్లు పెట్టిస్తోన్న ఉల్లి ధరలు.. కిలో ఉల్లి అక్షరాలా 890 రూపాయలు!
దేశంలో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మటన్, చికెన్ ధరలకంటే కేజీ ఉల్లి దాదాపు మూడు రెట్లు ఎక్కువ ధర పలుకుతోంది. ఈ మధ్యకాలంలో ఉల్లితోపాటు కొన్ని కూరగాయల ధరలు కూడా చికెన్, బీఫ్‌ల రేట్లను మించిపోతున్నాయి..
దేశంలో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మటన్, చికెన్ ధరలకంటే కేజీ ఉల్లి దాదాపు మూడు రెట్లు ఎక్కువ ధర పలుకుతోంది. ఈ మధ్యకాలంలో శ్రీలంక, పాకిస్థాన్‌లలో ఆర్థిక సంక్షోభం తలెత్తి ధరలు పెరడగం వల్ల ధరలు ఆకాశానికి ఎగబాకాయి. ఐతే మనం చర్చిస్తోంది ఈ రెండు దేశాల గురించి మాత్రం కాదు. వీటి సరసన కొత్తగా ఫిలిప్పీన్స్ కూడా చేరుతోంది. ఫిలిప్పీన్స్‌లో ఉల్లితోపాటు కొన్ని కూరగాయల ధరలు కూడా చికెన్, బీఫ్‌ల రేట్లను మించిపోతున్నాయి. గత నెల రోజుల్లో అక్కడ కేజీ ఉల్లిపాయల ధర ఇక్కడ 11 డాలర్లకు (భారత కరెన్సీలో రూ.890) పెరిగింది. ఐతే అక్కడ చికెన్ మాత్రం రూ.4 డాలర్లకే (రూ.325) అభిస్తోంది. ఫిలిప్పీన్స్ ప్రజల కనీస రోజువారి వేతనం 9 డాలర్లు (రూ.730). అంటే వారి ఒక రోజు జీతం కంటే కేజీ ఉల్లిపాయల ధరే ఎక్కువగా ఉందన్నమాట. అక్కడ ధరలు విపరీతంగా పెరగడంతో అక్రమంగా నిల్వచేస్తున్న ఉల్లిపాయలను అధికారులు పట్టుకుంటున్నారు. తాజాగా చైనా నుంచి అక్రమంగా తరలిస్తున్న 3,10,000 డాలర్ల (రూ.2.51 కోట్లు) విలువైన ఉల్లిపాయలను జనవరి నెల ప్రారంభంలో ఫిలిప్పీన్స్ అధికారులు పట్టుకున్నారు.
ఫిలిప్పీన్స్‌లో నెలకొన్ని దుస్థితిని విమర్శిస్తూ ఆ దేశ పౌరులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘చాక్లెట్స్‌కు గుడ్‌బై.. హలో ఆనియన్స్! ఈ రోజు ఎవరికైనా బహుమతి ఇవ్వాలంటే ఉల్లిపాయలనే తీసుకెళ్లొచ్చు’అని ఒకరు, ‘సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లి వస్తున్నప్పుడు చాక్లెట్లకు బదులు మేం ఉల్లిపాయలు తీసుకొచ్చాం’అని మరొకరు తమ పోస్టుల్లో రాసుకొచ్చారు. అమెరికాకు వెళ్తూ డబ్బా ఉల్లిపాయల పొడి తీసుకెళ్తున్న ఫోటోను ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
Goodbye chocolates, hello onions ?. Sibuyas has the potential to be the best pasalubong to Philippines. pic.twitter.com/38GR9aQMiu
— Jv Villar (@_jvvillar) January 5, 2023
ఇక హోటళ్లు, రెస్టారెంట్లలో ఉల్లితో వండే వంటకాలన్నింటినీ మెనూ లిస్ట్ నుంచి తొలగించారు. గత ఏడాది అక్కడ సంభవించిన తుఫానుల వల్ల ఉల్లి ఉత్పత్తి దెబ్బతిందని, అందుకే అక్కడ ఉల్లి ధరలు మండిపోతున్నట్లు కొన్ని అంతర్జాతీయ మీడియ సంస్థలు పేర్కొన్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.