China Corona: చైనాలో కొనసాగుతోన్న కరోనా విలయతాండవం.. ముందు, ముందు మరింత భయంకరంగా..
చైనాలో కరానో విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. చైనాలో కరోనా వైరస్ మహమ్మారి టెర్రర్ కొనసాగుతోంది. జీరో కోవిడ్ పాలసీ తర్వాత చైనాలో రోజు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఒక్క డిసెంబర్‌లోనే..
చైనాలో కరానో విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. చైనాలో కరోనా వైరస్ మహమ్మారి టెర్రర్ కొనసాగుతోంది. జీరో కోవిడ్ పాలసీ తర్వాత చైనాలో రోజు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఒక్క డిసెంబర్‌లోనే చైనాలో లక్షమందికి పైగా కరోనాతో చనిపోయినట్లు సమాచారం. చైనాలోని ప్రధాన నగరాలే కాదు, చిన్న చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ కోవిడ్ విజృంభించి వేలాదిగా మరణాలు సంభవిస్తున్నాయి.
చైనాలో కరోనా మరణమృదంగం మోగిస్తున్న వేళ.. బ్రిటన్ పరిశోధన సంస్థ ఎయిర్ఫినిటీ ఆందోళనకర విషయాలు వెల్లడించింది. ఆంక్షల ఎత్తివేత కారణంగా చైనాలో కొత్త సంవత్సర వేడుకలు.. చైనీయుల పాలిట మృత్యుపాశంగా మారనున్నాయని తెలిపింది. రానున్న రోజుల్లో రోజుకు 36 వేల మంది కొవిడ్‌తో మరణిస్తారని హెచ్చరించింది. కొవిడ్ వెలుగుచూసినప్పటి నుంచి ఇదే అత్యంత కఠినమైన వేవ్ అని చైనా హెల్త్ కమిషన్ అంగీకరించడం కలకలం రేపుతోంది.
మరోవైపు చైనాలో అంతకంతకూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. అక్కడక్కడ కోవిడ్ ఆంక్షలు విధించినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. కొన్నిప్రాంతాల్లో అధికారులే చేతులెత్తేశారు. రోజువారి అధికారిక లెక్కలు కూడా ప్రభుత్వం తన రిపోర్టులో చూపడంలేదని సమాచారం. అందుకే చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..