India – Pakistan: మరోసారి బయటపడిన డ్రాగన్ కంట్రీ డర్టీ యవ్వారం.. పంజాబ్ సరిహద్దులో..

గణతంత్ర దినోత్సవానికి ముందు.. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లో మిలిటరీ గ్రేడ్ హార్డ్‌వేర్‌ను పాకిస్తాన్ కు చెందిన డ్రోన్ విడిచింది. ఈ మిలిటరీ గ్రేడ్ హార్డ్ వేర్ ను చైనా తయారు చేసింది. భారతదేశం-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు...

India - Pakistan: మరోసారి బయటపడిన డ్రాగన్ కంట్రీ డర్టీ యవ్వారం.. పంజాబ్ సరిహద్దులో..
Border Security Force, Drones
Follow us

|

Updated on: Jan 19, 2023 | 3:06 PM

గణతంత్ర దినోత్సవానికి ముందు.. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లో మిలిటరీ గ్రేడ్ హార్డ్‌వేర్‌ను పాకిస్తాన్ కు చెందిన డ్రోన్ విడిచింది. ఈ మిలిటరీ గ్రేడ్ హార్డ్ వేర్ ను చైనా తయారు చేసింది. భారతదేశం-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత భూభాగంలో 8.5 కి.మీ దూరంలో ఉన్నప్పుడే బీఎస్ఎఫ్ జవాన్లు దీనిని గుర్తించారు. దీంతో అలర్ట్ అయిన.. బీఎస్ఎఫ్ సిబ్బంది పాకిస్తాన్ డ్రోన్‌పై కాల్పులు జరిపారు. భద్రత పరిస్థితుల కారణంగా సెక్యూరిటీని పెంచినట్లు గురుదాస్‌పూర్ సెక్టార్‌లోని బీఎస్‌ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ పర్దీప్ జోషి అన్నారు. భూమిపై ఏదో పడిన శబ్ధం వినిపించిందని, డ్రోన్ శబ్ధం తగ్గిన తర్వాత ఆ ప్రాంతమంతా సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. బీఎస్ఎఫ్ జవాన్లు చైనా తయారు చేసిన పిస్టల్స్ 4 , 8 మ్యాగజైన్లు, 47 రౌండ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

గణతంత్ర దినోత్సవానికి ముందు ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని బీఎస్ఎఫ్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ డ్రోన్ భారత భూభాగంపై 15 నిమిషాలకు పైగా ఎగురింది. గత కొన్ని రోజులుగా భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఇలాంటి అనుమానాస్పద సంఘటనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలు జరగనున్నందున భద్రతను మరింత పటిష్టం చేసినట్లు బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు.

డ్రోన్‌లో కొన్ని ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) ఉంటే అది భారత్ వైపు విధ్వంసం సృష్టించి ఉండేదని వారు అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ డ్రోన్ చాలా ఎత్తులో ప్రయాణించే అవకాశం ఉందని, అంతర్జాతీయ సరిహద్దులో స్నేహపూర్వకంగా ఎగిరే వస్తువులను గుర్తించే సాంకేతికత లేకపోవడంతో బీఎస్ఎఫ్ దళాలు దానిని గుర్తించలేకపోయారు. దీంతో సెక్యూరిటీని పటిష్ఠం చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..