Trending Video: బోనులో ఉంది కదా అని.. ఏకంగా సింహం నోట్లో వేలు పెట్టాడు.. దెబ్బకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చేసింది..

అడవికి రాజు సింహం. అక్కడ ఉండే అన్ని జంతువులకు పెద్దన్నగా ఉంటుంది. సింహాలు క్రూర జంతవులు. కాబట్టి జూ పార్కుల్లో వీటిని బోనుల్లో ఉంచుతారు. వాటి పరిసరాల్లోకి ఎవరూ వెళ్లనీయకుండా చర్యలు తీసుకుంటారు....

Trending Video: బోనులో ఉంది కదా అని.. ఏకంగా సింహం నోట్లో వేలు పెట్టాడు.. దెబ్బకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చేసింది..
Lion Trending Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 19, 2023 | 3:39 PM

అడవికి రాజు సింహం. అక్కడ ఉండే అన్ని జంతువులకు పెద్దన్నగా ఉంటుంది. సింహాలు క్రూర జంతవులు. కాబట్టి జూ పార్కుల్లో వీటిని బోనుల్లో ఉంచుతారు. వాటి పరిసరాల్లోకి ఎవరూ వెళ్లనీయకుండా చర్యలు తీసుకుంటారు. కానీ కొంతమంది ఔత్సాహికులు మాత్రం వాటితో ఆడుకోవాలని ప్రయత్నిస్తారు. ఓ వ్యక్తి ఇప్పుడు ఆలాగే చేశాడు. సింహాన్న ఆటపట్టిస్తూ ఏకంగా నోట్లో వేలు పెట్టాడు. ఇక సింహం ఊరుకుంటుందా.. కసి తీరా కొరికేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక సింహం బోనులో ఉండటాన్ని చూడవచ్చు. అదే సమయంలో అక్కడికి ఓ యువకుడు వస్తాడు. సింహాన్ని ఆటపట్టిస్తూ దాని నోట్లో చేయి పెడతాడు. దీంతో సింహం.. అతని చేయిని గట్టిగా పట్టుకుంటుంది. యువకుడు విడిపించేందుకు ప్రయత్నించినా అది విడవకపోవడం గమనార్హం.

వైరల్ అవుతున్న ఈ వీడియోను ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఒకటిన్నర వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ క్లిప్ చూసిన వారందరూ షాక్ అయ్యారు. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట, ఇలాంటి పనులు అస్సలు చేయవద్దు, యువకుడి పరిస్థితి దారుణం అని కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా.. గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. బోనులో ఉన్న సింహాన్ని జూ కీపర్ ఒక్కసారిగా రెచ్చగొట్టాడు. దాని నోట్లో వేళ్లు పెట్టి కెలికాడు. వేలును హఠాత్తుగా నోటిలోకి లాక్కుంది సింహం. అక్కడ వీడియోలు తీసుకుంటున్న పర్యాటకులు ఇదంతా జోకేమో అనుకున్నారు. కానీ, ఆ జూ కీపర్ మాత్రం వేలిని వదిలించుకోవడానికి తెగ ట్రై చేశాడు. వేలిని బలంగా లాగడంతో ఆ వ్యక్తి వేలు తెగిపోయింది.

View this post on Instagram

A post shared by Earth Reels (@earth.reel)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి