ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కన్నుమూసింది.. ఆమె వయసు ఎంతో తెలుసా..?

ఆ తర్వాత 8 ఏళ్లలో ఆమె సన్యాసినిగా మారింది. టీచర్‌గా కూడా పనిచేసిన లూసిలీ ర్యాండమ్‌ను సిస్టర్ ఆండ్రీ అని కూడా పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, ఆమె ఒక ఆసుపత్రిలో నర్సుగా చేరింది.

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కన్నుమూసింది.. ఆమె వయసు ఎంతో తెలుసా..?
Lucile Randon
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 19, 2023 | 8:05 PM

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపుపొందిన ఫ్రాన్స్‌ దేశస్తురాలు లూసిలీ ర్యాండమ్‌(118)ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. లూసిలీ ర్యాండమ్‌ 1904 ఫిబ్రవరి 11న దక్షిణ ఫ్రాన్స్‌లోని ఎలీస్‌ పట్టణంలో జన్మించిన ఆమె వృత్తిరీత్యా నర్సు. మంగళవారం టౌలూన్‌ పట్టణంలో ఈమె మరణించారని ఆమె తరఫు ప్రతినిధి వెల్లడించారు. 2021 జనవరిలో ఈమెకు కరోనా సోకింది. కోవిడ్‌ను జయించిన అత్యంత వృద్ధుల్లో ఒకరిగానూ చరిత్ర సృష్టించిన ఈమెను స్థానికులు సిస్టర్‌ ఆండ్రీగా పిలుస్తారు. లూసిల్లే మరణాన్ని ప్రకటిస్తూ, ఆమె ప్రచారకర్త డేవిడ్ డావెల్లా, లూసిల్లే రాండన్ నిద్రలోనే మరణించారని చెప్పారు. లుసిల్లే తన ప్రియమైన సోదరుడితో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు డావెల్లా చెప్పారు.

జపాన్‌కు చెందిన కెన్ తనసా 119వ ఏట మరణించారు. అతని తర్వాత లూసిలీ ర్యాండమ్‌ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచారు. 19 సంవత్సరాల వయస్సులో కాథలిక్కులుగా మారారు.. ఆ తర్వాత 8 ఏళ్లలో ఆమె సన్యాసినిగా మారింది. టీచర్‌గా కూడా పనిచేసిన లూసిలీ ర్యాండమ్‌ను సిస్టర్ ఆండ్రీ అని కూడా పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, ఆమె ఒక ఆసుపత్రిలో నర్సుగా చేరింది. 28 ఏళ్లపాటు అనాథలు, వృద్ధుల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించారు.

2020లో ఒక రేడియో స్టేషన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో,లూసిలీ ర్యాండమ్‌ ఇలా అన్నారు. 108 ఏళ్ల వరకు నా పనులు నేనే చేసుకున్నా. రోజూ ఒక చాక్లెట్‌ తినడం, ఒక గ్లాస్‌ వైన్‌ తాగడం నా అలవాటు’ అని ఆండ్రీ గతంలో చెప్పారు. “నేను ఇంత కాలం ఎలా జీవించాను అనే రహస్యం నాకు తెలియదు. దేవుడు మాత్రమే దీనికి సమాధానం ఇవ్వగలడు, ”అని చెప్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..