Quelea Birds: నేతలకు, ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న పక్షులు.. లక్షల క్యులియా పక్షులను చంపడానికి వార్ డిక్లేర్
క్యులియా పక్షి కనిపిస్తేనే కెన్యా గడగడలాడిపోతుంది. నేతలకు, ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంది. దీంతో కెన్యా ప్రభుత్వం ఈ పక్షులపై యుద్ధం ప్రకటించింది. లక్షల పక్షులను చంపడానికి వార్ డిక్లేర్ చేసింది.
ఆ పక్షులు కనిపిస్తేనే ఆ దేశం మొత్తం హడలెత్తిపోతుంది. ఎక్కడి నుంచి ఏ పక్షి వస్తుందోనని వణికిపోతున్నారు అక్కడి జనం. చూడ్డానికి ఎంతో అందంగా ఉన్న ఆ పక్షులు ప్రజలకు చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో ఆ పక్షులపై నేరుగా యుద్ధం ప్రకటించాల్సి వచ్చింది. ఇంతకీ ఆ పక్షులేంటి.. యుద్ధం ఏంటి.. పక్షులపై వార్ డిక్లేర్ చేసిన ఆ దేశం ఏమిటో తెలుసా.. చూడ్డానికి ఎర్రటి ముక్కు.. చిన్నగా కనిపించే అందమైన రూపం. దీన్నీ కెన్యన్లు క్యులియా పక్షి అని పిలుచుకుంటారు. కానీ, ఇప్పుడు క్యులియా పక్షి కనిపిస్తేనే కెన్యా గడగడలాడిపోతుంది. నేతలకు, ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంది. దీంతో కెన్యా ప్రభుత్వం ఈ పక్షులపై యుద్ధం ప్రకటించింది. లక్షల పక్షులను చంపడానికి వార్ డిక్లేర్ చేసింది.
కెన్యాలో లక్షలాదిగా ఉన్న ఈ పక్షులు వందల టన్నుల ఆహార ధాన్యాలను ఆహారంగా ఆరగిస్తూ అటు రైతులను, ఇటు ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. గోధుమ, బార్లీ, రైస్, సన్‌ఫ్లవర్ పంటలపై పడి నాశనం చేస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు. అందకే కెన్యా ప్రభుత్వం వీటిపై యుద్ధం ప్రకటించింది. లక్షల పక్షులను చంపడానికి చర్యలు ప్రారంభించింది.
ఒకప్పుడు కరవుతో బాధపడిన కెన్యా దేశాన్ని ఈ పక్షులు తిరిగి ఆ స్థితికి తెస్తాయేమోనన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతున్నది. కెన్యాలో లక్షలాదిగా ఉన్న ఈ పక్షులు వందలాది టన్నుల ఆహార ధాన్యాలను చూస్తుండగానే మాయం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా పంటల మీద వాలుతూ చేతికొచ్చిన పంటను స్వాహ చేస్తున్నాయి. అటు రైతులను, ఇటు ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రైతులు పండిస్తున్న గోధుమ, బార్లీ, రైస్, సన్‌ఫ్లవర్ పంటలపై పడి నాశనం చేస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు.
క్యూలియా పక్షులు ధాన్యపు పొలాలపై ఎక్కువగా దాడి చేస్తాయి. దీనివల్ల రెండు వేల ఎకరాల్లో వరి పంటకు ముప్పు ఏర్పడింది. పక్షుల దాడిలో దాదాపు మూడు వందల ఎకరాల్లో వరి పొలాలు ధ్వంసమైనట్టు ప్రభుత్వం గుర్తించింది. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ఒక క్వీలియా పక్షి రోజుకు 10 గ్రాముల వరకు ధాన్యం తింటుంది. దీంతో కెన్యాలోని రైతులు దాదాపు 60 టన్నుల ధాన్యం కోల్పోవాల్సి వస్తుంది. క్యులియా పక్షుల వల్ల సంవత్సరానికి యాభై మిలియన్ డాలర్ల పంటనష్టం ఉంటుందని FAO అంచనా వేసింది.
క్యులియా పక్షుల దండయాత్ర తరచుగా ఆఫ్రికన్ దేశాలలో కనిపిస్తుంటుంది. ఆరు నెలల క్రితం 21 మిలియన్ల క్యూలియా పక్షులు వరి, జొన్న, మిల్లెట్ గోధుమ పొలాలపై దాడి చేసి ధాన్యం మొత్తం మాయం చేశాయి. క్యులియా పక్షులపై పురుగుమందుల చల్లడం, వాటిపై నిఘా పెట్టడం కోసం టాంజానియా ప్రభుత్వం ఐదు లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చింది.
అయితే పొలాలపై దాడి చేసిన 6 మిలియన్ల రెడ్-బిల్డ్ క్యూలియా పక్షులను చంపడానికి కెన్యా ప్రభుత్వం చేసిన డ్రైవ్ ఇతర అటవీ జంతువులకు, పక్షులకు ఊహించని నష్టం కలిగిస్తుందని నిపుణులు హెచ్చరించారు. ఫెంథియాన్, ఆర్గానోఫాస్ఫేట్ పురుగుమందును పిచికారీ చేయడం వల్ల పక్షులను అంతమొందించాలని చూస్తున్నారు. అయితే ఈ రసాయనం వాడటం వల్ల మనుషులు, ఇతర జీవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని, మూగజీవాలు చనిపోతాయని అంటున్నారు.
రసాయనాల ద్వారా పక్షులను చంపే బదులు వాటి ఉత్పత్తిని నియంత్రిస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. క్యులియా సంతానోత్పత్తి ప్రాంతాలను గుర్తించి వాటి వృద్దిని అరికట్టవచ్చని అంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..