- Telugu News Photo Gallery World photos Viral News: meet jaures kombila one of the most flexible man of africa
Viral Photos: బాబోయ్.. మంత్రంలేదు మ్యాజిక్ లేదు.. రబ్బరులా శరీరాన్ని సాగదీస్తున్న యువకుడు..
ఈ యువకుడు శరీరం రబ్బరులా సాగుతుంది. ఓ స్ప్రింగ్ లా ఎలా కావలిస్తే అలా తన బాడీని తిప్పేస్తాడు.. ఇలాంటి శరీరం తీరుని కలిగి ఉన్న ఈ యువకుడు బాల్యంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడే అదే స్పెషాలిటీతో తనదైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఆఫ్రీకాలోని గబాన్‌కు చెందిన ఈ యువకుడు తన ఫ్లెక్సిబుల్ బాడీ కారణంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
Updated on: Jan 13, 2023 | 1:30 PM

జారెస్ కొంబిలా ఆఫ్రికన్ దేశమైన గాబన్‌కు చెందినవాడు. తన శరీరాన్ని ఎటువైపు కావాలంటే ఆ విధంగా అద్భుతంగా మెలి తిప్పేస్తాడు. ఇతని విన్యాసాలు చూసిన వారికీ ఎవరికైనా అసలు ఇతని శరీరంలో ఎముకలు ఉన్నాయనే అనుమానం రాక మానదు.

కొన్నిసార్లు శరీరంలోని ఏదైనా ఒక భాగాన్ని వంచడం చాలా కష్టం.. ఈ ఆఫ్రికాకు చెందిన జారెస్ కొంబిలా శరీరం చాలా ఫెక్సీ బుల్ గా ఉంటుంది. తన శరీరాన్ని రబ్బరు లా వంచేస్తాడు. చేతులు, తల, కాళ్ళను 180 డిగ్రీల కోణంలో ఏ దిశలోనైనా పూర్తిగా తిప్పేస్తాడు. యువకుడిలోని ఈ లక్షణాల కారణంగా అతడిని మొదట్లో మంత్రగత్తె అని పిలిచేవారు.. అయినప్పటికీ జారెస్ కొంబిలా ప్రజల వెక్కిరింపులను లెక్కచేయలేదు.

BBC నివేదిక ప్రకారం జారెస్ కొంబిలా తన చేతులు, తల, కాళ్ళను.. ఇలా శరీరాన్ని 180 డిగ్రీల కోణంలో ఏ దిశలోనైనా పూర్తిగా తిప్పేస్తాడు. స్ప్రింగులా వంగే తన శరీరంతో దాదాపు ఏ పొజిషన్ అయినా చేస్తాడు.

జారెస్ వృత్తి రీత్యా కాంటోర్షనిస్ట్. తన ఫ్లెక్సిబుల్ బాడీ కారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటాడు.

కంటోర్షనిస్ట్ జారెస్ తన శరీరం తీరుని గురించి మాట్లాడుతూ.. మొదట్లో ప్రజలు తన కళను ఎగతాళి చేసేవారని చెప్పాడు. కొంతమంది తనను మంత్రగాడు అని కూడా పిలిచేవారని గుర్తు చేసుకున్నాడు. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తనకు దైవం ఇచ్చిన శరీర తీరుని మరింత మెరుగుపరుచుకుని.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నట్లు చెప్పాడు.

మీ మైండ్ ఫ్లెక్సిబుల్‌గా ఉంటే, ప్రపంచంలోని ఏ పనీ మీకు కష్టం కాదని కంటోర్షనిస్ట్ జారెస్ చెబుతున్నాడు. అందుకు తనకు బాల్యంలో ఎదురైనా అవమానాలు.. ఈరోజు తాను తెచ్చుకున్న గుర్తింపు సజీవ సాక్ష్యం అంటున్నాడు





























