Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రామానికి మొదటి ఐఏఎస్ అధికారిణి.. అమ్మనాన్నల ఆనందం.. మమతా యాదవ్ సక్సెస్‌ స్టోరీ..

మమతా యాదవ్ ఐఏఎస్ కావడానికి సర్వస్వం త్యాగం చేసింది. పగలు రాత్రి చదువుకోడం మొదలుపెట్టింది. మళ్ళీ 2020 సంవత్సరంలో UPSC పరీక్ష రాసింది. ఈసారి ఆమె ఆల్‌ ఇండియా 5వ ర్యాంక్ సాధించింది.

గ్రామానికి మొదటి ఐఏఎస్ అధికారిణి.. అమ్మనాన్నల ఆనందం.. మమతా యాదవ్ సక్సెస్‌ స్టోరీ..
Mamta Yadav
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 19, 2023 | 7:17 PM

సక్సెస్‌ మ్యాన్‌గా నిలవడం అందరికీ సాధ్యం కాదు..కొందరు మాత్రమే ఈ ఘనత సాధిస్తారు. విజయవంతమైన వ్యక్తిగా మారడానికి ముందు చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. పగలనక రాత్రనక కష్టపడి లక్ష్యం పట్ల ఏకాగ్రత, పూర్తి అంకితభావం చూపాలి. అప్పుడే వ్యక్తి విజయాన్ని రుచి చూస్తాడు. దేశంలోని అత్యున్నత పరిపాలనా సేవ అంటే ఐఏఎస్ అధికారి కావాలన్నది ప్రతి యువత కల. విద్యార్థులు ఈ గొప్ప స్థానాన్ని సాధించడానికి పగలు రాత్రి కష్టపడుతూ ఉంటారు.కానీ, ఈ కృషి మీ విజయాన్ని నిర్ణయించదు. ఐఏఎస్‌ అధికారి కావాలనేది చాలా మంది కల..! చాలా మంది విద్యార్థులు తమ జీవితంలో ఎక్కువ కాలం ఈ పరీక్షను ఇస్తుంటారు. వారి ప్రయత్నంలో ఏదో ఒక రోజు IAS అధికారిగా మారి దేశానికి సేవ చేయగలుగుతారు. వారి కుటుంబానికి ప్రశంసలు అందిస్తారు. మరోవైపు, కొందరు ఫెయిల్ అయినప్పుడు తమ మార్గాన్ని మార్చుకుంటారు. వారి లక్ష్యాన్ని మార్చుకుంటారు. అయితే కొంతమంది విద్యార్థులు విజయం సాధించే వరకు అదే మార్గంలో పయనిస్తుంటారు. అలాంటి విజయ ప్రయాణంలో చివరకు సక్సెస్‌ సాధించింది హర్యానాకు చెందిన ఓ యువతి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో ఐఏఎస్‌గా నిలిచి విజయం సాధించిన హర్యానాకు చెందిన మమత విజయగాథ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం…

మమత స్వస్థలం హర్యానా. ఆమె పాఠశాల,కళాశాల విద్య మొత్తం ఢిల్లీలోనే పూర్తయింది. గ్రేటర్ కైలాష్‌లోని ప్రైవేట్ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. దీని తరువాత, మమత గ్రాడ్యుయేషన్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హిందూ కళాశాలలో చేరింది. నాలుగేళ్లపాటు యూపీఎస్సీ ప్రిపరేషన్‌ జరిగింది. యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం మమతా యాదవ్ తన జీవితంలో నాలుగేళ్లు కేటాయించింది. ఈ నాలుగేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు చూసినా ధైర్యం కోల్పోలేదు. 2019 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. అప్పుడు ఆమెకు 556వ ర్యాంక్ వచ్చింది.

చదువుతో పాటు మమత ఉద్యోగం సాగించింది. ఆమె 2019 సంవత్సరంలో UPSC పరీక్షలో 556 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించినప్పుడు, ఆమెకు భారతీయ రైల్వే సిబ్బంది సేవలో ఉద్యోగం వచ్చింది. తన ట్రైనింగ్‌ కూడా ఇక్కడే ప్రారంభమైంది. కానీ, ఆమెకు ఐఏఎస్ కావాలనే కోరిక మాత్రం అలానే ఉంది. దాన్ని నెరవేర్చుకోవాలనే తపనతో మళ్లీ ఐఏఎస్‌కి ప్రిపేర్‌ అయింది. మమతా యాదవ్ ఐఏఎస్ కావడానికి సర్వస్వం త్యాగం చేసింది. పగలు రాత్రి చదువుకోడం మొదలుపెట్టింది. మళ్ళీ 2020 సంవత్సరంలో UPSC పరీక్ష రాసింది. ఈసారి ఆమె ఆల్‌ ఇండియా 5వ ర్యాంక్ సాధించింది. పరీక్ష ఫలితాలు రాగానే ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. కూతురు విజయం సాధించడంతో తల్లిదండ్రులిద్దరూ చాలా సంతోషించారు.

ఇవి కూడా చదవండి

మమతా యాదవ్ UPSC కోసం కోచింగ్‌పై మాత్రమే ఆధారపడలేదు. ఆమె స్వయంగా చదువుకోవాలని గట్టి పట్టుదలతో ప్రయత్నించింది. ఇందుకోసం ఆమె రోజుకు 08 నుంచి 10 గంటల పాటు చదువుకునేది. ఆమె తన ప్రిపరేషన్‌ను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసేది. ఈ కఠినమైన పరీక్షను ఛేదించడానికి NCERT, ఇతర పుస్తకాల సహాయం తీసుకున్నట్టుగా చెప్పింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..