JEE Mains: విద్యార్థులకు అలర్ట్.. షెడ్యూల్, పరీక్ష తేదీల్లో మార్పులు.. మళ్లీ ఎప్పుడంటే..

దేశవ్యాప్తంగా ఉన్న ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్ష తేదీల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు జాతీయ...

JEE Mains: విద్యార్థులకు అలర్ట్.. షెడ్యూల్, పరీక్ష తేదీల్లో మార్పులు.. మళ్లీ ఎప్పుడంటే..
Jee Mains
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 19, 2023 | 6:33 PM

దేశవ్యాప్తంగా ఉన్న ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్ష తేదీల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు జాతీయ పరీక్షల మండలి తెలిపింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌లో పరీక్షను జనవరి 24, 25, 27, 28 ,29, 30, 31వరకు నిర్వహించనున్నట్టు తెలిపింది. అయితే తాజాగా.. జనవరి 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపింది. జనవరి 28న బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ విభాగంలో పేపర్‌-2ఏ, 2బీ పరీక్ష జరుగుతుంది. దేశంలోని 290 నగరాల్లో, దేశం వెలుపల 25 నగరాల్లో జేఈఈ మెయిన్‌ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అడ్మిట్‌ కార్డులను త్వరలోనే అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.

జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. మెయిన్‌లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్‌లో నిర్వహిస్తారు. అందులో వచ్చే ర్యాంక్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహిస్తున్నారు. తొలి విడత జనవరిలో, రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. తెలంగాణలో జేఈఈ మెయిన్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెద్ద షాకిచ్చింది. రాష్ట్రంలో నాలుగు పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. జేఈఈ పరీక్షలు నిర్వహించే పట్టణాల జాబితా నుంచి రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, గద్వాల, మంచిర్యాల, వికారాబాద్‌ కేంద్రాలను తొలగించింది.

గతేడాది రాష్ట్రంలో 21 పట్టణాల్లో జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహించగా, ఈ ఏడాది 17 పట్టణాలకే పరిమితం చేసింది. హయత్‌నగర్‌, హైదరాబాద్‌/సికింద్రాబాద్‌, జగిత్యాల, జనగాం, కరీంనగర్‌, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, మేడ్చల్‌, నల్లగొండ, నిజామాబాద్‌, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌ పట్టణాల్లో మాత్రమే ఈ ఏడాది పరీక్షలు నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్