AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rozgar Mela: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువుల జాతర.. 71వేల మందికి ప్రధాని మోదీ చేతుల మీదుగా జాబ్ లెటర్స్..

అన్న మాట నిలుపుకుంటున్నారు. లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు. "సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్" అంటూ ప్రధాని మోదీ చెప్పిన మాటలను చేసి చూపిస్తున్నారు. ఇందులో బాగంగా మూడవ విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందిన 71వేల మందికి జాబ్ లెటర్స్ అందించనున్నారు.

Rozgar Mela: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువుల జాతర.. 71వేల మందికి ప్రధాని మోదీ చేతుల మీదుగా జాబ్ లెటర్స్..
Under Rozgar Mela
Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 20, 2023 | 7:47 AM

Share

కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన ఉద్యోగులకు ప్రధాని నరేంద్రమోదీ జాబ్ లెటర్స్ అందించనున్నారు. జనవరి 20న దాదాపుగా 71 వేల మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందించనున్నారు. ప్రధాని మంత్రి కార్యాలయం(పీఎంఓ) తాజాగా ఈ ప్రకటన విడుదల చేసింది. పీఎంవో అందించిన సమాచారం ప్రకారం.. ప్రధాని మోదీ వీడియో కాన్పరెన్స్ ద్వాారా ఉదయం 10.30 గంటలకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేస్తారని.. కొత్తగా ఉద్యోగంలో చేరబోతున్నవారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 10 లక్షల మంది సిబ్బంది రిక్రూట్‌మెంట్ డ్రైవ్ “రోజ్గర్ మేళా” పేరుతో జరగనుంది. నేడు అనగా శుక్రవారం సుమారు 71వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందజేయనున్నారు.

ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్ధతను నెరవేర్చే దిశగా రోజ్‌గార్ మేళా ఒక ముందడుగు అని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. రోజ్‌గార్ మేళా మరింత ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని.. యువతను వారి సాధికారత కోసం శక్తివంతం చేస్తుందని ఆశిస్తున్నాం. దేశాభివృద్ధిలో భాగస్వామ్యానికి అర్ధవంతమైన అవకాశాలను అందించందని వెల్లడించింది పీఎంఓ.

దేశవ్యాప్తంగా ఎంపికైన..

కేంద్ర ప్రభుత్వశాఖల్లో జూనియర్ ఇంజనీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్లు, స్టెనోగ్రాఫర్లు, జూనియర్ అకౌంటెంట్లు, గ్రామీణ్ డాక్ సేవకులు, ఆదాయపు పన్ను ఇన్స్పెక్టర్లు, టీచర్లు, నర్సులు, డాక్టర్లు, సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్లు, PA, MTS వంటి వివిధ పోస్టులకు నియామకం పొందినవారికి ఈ పత్రాలు అందించనున్నారు ప్రధాని.

ఆన్‌లైన్ ఓరియంటేషన్ కోర్సు..

రోజ్‌గర్ మేళా కార్యక్రమంలో కొత్తగా నియమితులైన సిబ్బంది ‘కర్మయోగి స్టార్ట్ మాడ్యూల్’ గురించి వారి అనుభవాలను కూడా పంచుకుంటారు. కర్మయోగి ప్రారంభం మాడ్యూల్ అనేది వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా రిక్రూట్ అయిన ఉద్యోగులందరికీ ఆన్‌లైన్ ఓరియంటేషన్ కోర్సు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, కార్యాలయ నీతి, సమగ్రత, మానవ వనరుల విధానాలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం