Free Coaching For Groups: తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్! గ్రూప్స్ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం
గ్రూప్స్‌కు ప్రిపేపరవుతున్న తెలంగాణ నిరుద్యోగులకు మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు గ్రూప్ 2, 3, 4 పరీక్షలకు సన్నద్ధమవుతున్న..
గ్రూప్స్‌కు ప్రిపేపరవుతున్న తెలంగాణ నిరుద్యోగులకు మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు గ్రూప్ 2, 3, 4 పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఎస్సీ నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ హైదరాబాద్ ద్వారా నిర్వహించే ఉచిత శిక్షణ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల డిగ్రీ మార్కుల ఆధారంగా మెరిట్ మార్కులున్న మొదటి 100 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా హైదరాబాద్ జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు. ఈ శిక్షణ పూర్తిగా నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు జనవరి 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ లేదా 040- 23546552 ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.