TSPSC Group-1 Mains 2023: తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష విధానం ఇదే.. పూర్తి సిలబస్‌తో పూర్తి వివరాలిలా..

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 మెయిన్స్‌కు సంబంధించి ప్రశ్నపత్రం విధానాన్ని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. మెయన్స్‌లో మొత్తం 6 పేపర్లకు పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులకు..

TSPSC Group-1 Mains 2023: తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష విధానం ఇదే.. పూర్తి సిలబస్‌తో పూర్తి వివరాలిలా..
TSPSC Group 1 Mains exam 2023 pattern
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 19, 2023 | 1:08 PM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. తదుపరి ఘట్టమైన మెయిన్స్‌కు సంబంధించి ప్రశ్నపత్రం విధానాన్ని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష విధానం వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. మెయన్స్‌లో మొత్తం 6 పేపర్లకు పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఒక్కోపేపర్‌కు 3 గంటల సమయం కేటాయిస్తారు.

పరీక్ష విధానం ఈ విధంగా ఉంటుంది..

  • పేపర్‌1లో జనరల్‌ ఎస్సేలు ఉంటాయి. ఈ పేపర్‌లో మూడు సెక్షన్‌లలో ఒక్కో సెక్షన్‌కు 50 మార్కుల చొప్పున మొత్తం 150 మార్కులు కేటాయిస్తారు. ఒక్కో సెక్షన్‌లో మూడు ప్రశ్నలు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో ఒక ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. ప్రతి ఎస్సే 1000 పదాలకు తగ్గకుండా ఉండాలి. వెయ్యిపదాల్లో ఉండాలి.
  • పేపర్‌ 2లో చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ సబ్జెక్టులు ఉంటాయి.ఈ పేపర్‌లో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో అయిదు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా రాయాలి. తొలి రెండు ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా రాయాలి. 3,4,5, ప్రశ్నలకు ఇంటర్నల్‌ ఛాయిస్‌ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 200 పదాల్లో సమాధానం రాయాలి. ఒక్కో సెక్షన్‌కు 50 (ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు) మార్కుల చొప్పున 150 మార్కులు కేటాయిస్తారు.
  • పేపర్‌ 3లో భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన సబ్జెక్టులు ఉంటాయి.ఈ పేపర్‌లో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో అయిదు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా రాయాలి. తొలి రెండు ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా రాయాలి. 3,4,5, ప్రశ్నలకు ఇంటర్నల్‌ ఛాయిస్‌ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 200 పదాల్లో సమాధానం రాయాలి. ఒక్కో సెక్షన్‌కు 50 (ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు) మార్కుల చొప్పున 150 మార్కులు కేటాయిస్తారు.
  • పేపర్‌ 4లో ఎకానమీ, డెవలప్‌మెంట్‌ సబ్జెక్టులు ఉంటాయి. ఈ పేపర్‌లో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో అయిదు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా రాయాలి. తొలి రెండు ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా రాయాలి. 3,4,5, ప్రశ్నలకు ఇంటర్నల్‌ ఛాయిస్‌ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 200 పదాల్లో సమాధానం రాయాలి. ఒక్కో సెక్షన్‌కు 50 (ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు) మార్కుల చొప్పున 150 మార్కులు కేటాయిస్తారు.
  • పేపర్‌ 5లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ ఉంటాయి. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి రెండు సెక్షన్లలో అయిదు ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఈ సెక్షన్లలో తొలిరెండు ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబు ఇవ్వాలి. మిగతా మూడు ప్రశ్నలకు ఇంటర్నల్‌ ఛాయిస్‌ ఉంటుంది. ప్రశ్నలకు సమాధానం 200 పదాల్లో ఉండాలి. ఇక మూడో సెక్షన్‌లో మొత్తం 30 ప్రశ్నలుంటాయి. వీటిల్లో ఏవైనా 25 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 50 మార్కులు కేటాయిస్తారు.
  • పేపర్‌-6లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలు ఉంటాయి. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో అయిదు ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం 200 పదాల్లో ఇవ్వాలి. ఒక్కోప్రశ్నకు పది మార్కులు చొప్పున మొత్తం 15 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించింది. అయితే ఒక్కో సెక్షన్‌లోని అయిదు ప్రశ్నల్లో తొలిరెండు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరి ఇవ్వాలి. ఇందులో ఛాయిస్‌ ఉండదు. మూడు, నాలుగు, అయిదు ప్రశ్నల్లో ఛాయిస్‌ ఆప్షన్‌ ఉంటుంది.

జనరల్‌ ఇంగ్లిష్‌.. ఇది అర్హత పరీక్ష. ఇందులో పదిహేను ప్రశ్నలు ఉంటాయి. ఎస్సే రైటింగ్‌, లెటర్‌ రైటింగ్, గ్రామర్‌ తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.