AP Police SI Hall ticket 2023: ఆంధ్రప్రదేశ్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ పోస్టులకు వెల్లువెత్తిన దరఖాస్తులు.. ఫిబ్రవరి 5 నుంచి హాల్‌ టికెట్లు

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Jan 19, 2023 | 12:30 PM

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ (ఎస్సై) పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ బుధవారం (జనవరి 18)తో ముగిసింది. మొత్తం 411 ఎస్‌ఐ (సివిల్‌ పోలీస్‌ 315, రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 96) పోస్టులకు దాదాపు..

AP Police SI Hall ticket 2023: ఆంధ్రప్రదేశ్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ పోస్టులకు వెల్లువెత్తిన దరఖాస్తులు.. ఫిబ్రవరి 5 నుంచి హాల్‌ టికెట్లు
Ap Police Si Hall Tickets

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ (ఎస్సై) పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ బుధవారం (జనవరి 18)తో ముగిసింది. మొత్తం 411 ఎస్‌ఐ (సివిల్‌ పోలీస్‌ 315, రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 96) పోస్టులకు దాదాపు 1,73,047 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నట్లు ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. వీరిలో పురుష అభ్యర్థులు 1,40,453 మంది దరఖాస్తు చేసుకోగా.. మహిళా అభ్యర్థులు 32,594 వరకు ఉన్నారు. ఈ క్రమంలో ఎస్ఐ కొలువులకు గట్టి పోటీ నెలకొంది. ఒక్కోపోస్టుకు దాదాపు 421 మంది పోటీపడుతున్నారు.

కాగా సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రక్రియ కొనసాగింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్‌ 1, మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిముషాల వరకు పేపర్‌ 2 పరీక్ష జరగనుంది. ఫిబ్రవరి 5 నుంచి హాల్‌ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu