Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India Pee-gate: విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన కేసు.. నాలుగు నెలలు నిషేధం.. ఏం జరిగిందంటే..

ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు..ఎయిరిండియా విమానం AI102లో న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వెళ్లే ఫ్లైట్‌లో మద్యం సేవించి మూత్ర విసర్జన చేశాడని, ఆ తర్వాత సదరు వ్యక్తిపై ఎయిర్స్‌లైన్స్‌ చర్యలు చేపట్టలేదని బాధితురాలు ఎయిర్‌ ఇండియా చైర్మన్‌కు రాసిన లేఖలో ఆరోపించింది.

Air India Pee-gate: విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన కేసు.. నాలుగు నెలలు నిషేధం.. ఏం జరిగిందంటే..
Twist In Air India
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 19, 2023 | 6:36 PM

ఎయిర్‌ ఇండియా విమానంలో వృద్ధురాలిపై మూత్రవిసర్జన కేసు కొనసాగుతూనే ఉంది. నవంబర్ 26, 2021న ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా నిషేధం విధించింది. శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా నాలుగు నెలల నిషేధం విధించింది. శంకర్ మిశ్రా 4 నెలల పాటు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించడానికి అవకాశం లేదు. మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసినట్లు శంకర్ మిశ్రాపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి శంకర్ మిశ్రాను జనవరి 7న బెంగళూరులో అరెస్టు చేశారు. 42 రోజుల పాటు అతని కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు మొబైల్ లొకేషన్ సహాయంతో నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతను ముంబై నివాసిగా తేలింది. అయితే, ఓ మహిళా ప్రయాణికురాలి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ విషయమై మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేశారు. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు..ఎయిరిండియా విమానం AI102లో న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వెళ్లే ఫ్లైట్‌లో మద్యం సేవించి మూత్ర విసర్జన చేశాడని, ఆ తర్వాత సదరు వ్యక్తిపై ఎయిర్స్‌లైన్స్‌ చర్యలు చేపట్టలేదని బాధితురాలు ఎయిర్‌ ఇండియా చైర్మన్‌కు రాసిన లేఖలో ఆరోపించింది. ఆ తర్వాత ఎయిర్‌లైన్స్‌ కంపెనీ జనవరి 4న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు బెంగాళూరులో మిశ్రాను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

ఇదిలా ఉండగా.. వృద్ధురాలిపై మద్యం సేవించి మూత్రం పోసినట్లు వచ్చిన వార్తలను శంకర్‌ మిశ్రా ఖండించారు. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సదరు వృద్ధురాలే మూత్రం పోసుకుందని, ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని కోర్టుకు తెలిపారు. ఆమె కూర్చున్న సీటు వద్దకు వెళ్లరాదని, అక్కడికి వెళ్లినా సీటు వెనుక వైపు నుంచి మాత్రమే వెళ్లగలరని, నేను మద్యం మత్తులో ఆమె సీటు వద్దకు వెళ్లినా.. మూత్ర విసర్జన చేశానంటే వెనుక సీట్లో కూర్చున్న వారు ఫిర్యాదు చేయాలి కదా? అని కూడా సందేహం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..