Hijab: తెరపైకి మళ్లీ హిజాబ్ వివాదం.. బురఖా వేసుకున్నారని క్యాంపస్ లోకి నిరాకరణ..
ఉత్తరప్రదేశ్ లో బురఖా వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కర్నాటకలో చిచ్చు రేపిన హిజాబ్ వివాదం.. కొన్నాళ్ల తర్వాత ఇప్పడు మళ్లీ యూపీలో వెలుగుచూడటం కలకలం సృష్టించింది. మొరాదాబాద్‌లోని హిందూ కళాశాలలో బురఖా...
ఉత్తరప్రదేశ్ లో బురఖా వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కర్నాటకలో చిచ్చు రేపిన హిజాబ్ వివాదం.. కొన్నాళ్ల తర్వాత ఇప్పడు మళ్లీ యూపీలో వెలుగుచూడటం కలకలం సృష్టించింది. మొరాదాబాద్‌లోని హిందూ కళాశాలలో బురఖా ధరించిన కొంతమంది విద్యార్థినులను కాలేజ్ లోకి వెళ్లేందుకు నిరాకరించారు. బురఖా ధరించామనే కారణంతో తమను క్యాంపస్ లోకి వెళ్లనివ్వడం లేదని బాధిత విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. బురఖా వివాదంపై హిందూ కాలేజీలో జరిగిన ఘటనపై వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. కళాశాలలో తాము విద్యార్థులకు డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తున్నామని, దీన్ని అనుసరించడానికి నిరాకరించిన వారు ఎవరైనా కళాశాల క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా నిషేధిస్తామని కళాశాల ప్రొఫెసర్ స్పష్టం చేశారు.
కాగా.. గతంలో కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కాలేజీలో కొందరు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యేందుకు ప్రయత్నించగా వారిని అధికారులు అడ్డుకున్నారు. డ్రెస్ కోడ్‌ను విధించిందని, అందువల్ల హిజాబ్‌ను ధరించి వచ్చేవారిని అనుమతించబోమని చెప్పారు. దీనిని విద్యార్థినులు తప్పుబట్టారు. తమను హిజాబ్‌తో తరగతులకు అనుమతించాలని విద్యార్థులు ఆందోళనలు కొనసాగించారు.
కర్ణాటకలోని కొన్ని కాలేజీల్లో ముస్లిం యువతులు హిజాబ్ ధరించకుండా నిషేధం విధించడంతో హైకోర్టులో రెండు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. 8 ఫిబ్రవరి 2022న కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించడంపై వివాదం తీవ్రమైంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మూడు రోజుల పాటు ఉన్నత పాఠశాలలు మరియు కళాశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..