LIC Jeevan Azad: ఎల్‌ఐసీ సరికొత్త ప్లాన్‌.. రూ.25 వేల పెట్టుబడితో రూ.5 లక్షల వరకు మెచ్యూరిటీ.. ప్లాన్ పూర్తి వివరాలివే..

వ్యక్తిగత పొదుపు, జీవిత బీమాను లక్ష్యంగా ఎల్ఐసీ జీవన్ ఆజాద్ అనే సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎల్ఐసీ ప్రకటించింది. LIC జీవన్ ఆజాద్ 868 ప్లాన్..

LIC Jeevan Azad: ఎల్‌ఐసీ సరికొత్త ప్లాన్‌.. రూ.25 వేల పెట్టుబడితో రూ.5 లక్షల వరకు మెచ్యూరిటీ.. ప్లాన్ పూర్తి వివరాలివే..
Lic Jeevan Azad
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 20, 2023 | 3:53 PM

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక బీమా ప్లాన్‌లను తీసుకువస్తున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత పొదుపు, జీవిత బీమాను లక్ష్యంగా ఎల్ఐసీ జీవన్ ఆజాద్ అనే సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎల్ఐసీ ప్రకటించింది. LIC జీవన్ ఆజాద్ 868 ప్లాన్.. వినియోగదారులకు వ్యక్తిగత పొదుపు, జీవిత బీమా రక్షణతోపాటు వివిధ ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. ఎల్‌ఐసీ జీవన్‌ ఆజాద్‌ (LIC Jeevan Azad).. లిమిటెడ్‌ పీరియడ్‌ పేమెంట్‌ ఎండోమెంట్‌ ప్లాన్‌.. పాలసీదారుడు పాలసీ కాలవ్యవధిలో మరణిస్తే కుటుంబానికి రూ.ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీంతోపాటు మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే.. గ్యారెంటీ ఇచ్చిన మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించనుంది. ఈ పాలసీలో రుణం తీసుకునే సదుపాయం కూడా ఉందని ఎల్ఐసీ ప్రకటించింది.

LIC జీవన్ ఆజాద్ ప్లాన్ ఫీచర్లు:

  • ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ ప్లాన్.. కనీస ప్రాథమిక హామీ రూ.2 లక్షలు.
  • గరిష్ఠ ప్రాథమిక హామీ రూ.5 లక్షలు.
  • పాలసీ గరిష్ఠ కాలపరిమితి 20 ఏళ్లు.

LIC జీవన్ ఆజాద్ వయోపరిమితి:

  • కనీస ప్రవేశ వయస్సు 90 రోజులు, గరిష్ట ప్రవేశ వయస్సు 50 సంవత్సరాలు.
  1. LIC జీవన్ ఆజాద్ అనేది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్, వ్యక్తిగత, సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మరియు పరిమిత ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్.
  2. ఇది పరిమిత ప్రీమియం చెల్లింపు ఎంపికను కలిగి ఉంది, ఇక్కడ ప్రీమియం చెల్లింపు వ్యవధి (20ఏళ్లు) పాలసీ వ్యవధి కంటే 8 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది.
  3. పాలసీ వ్యవధిలో జీవిత బీమా ఉన్న వ్యక్తి మరణిస్తే ఈ ప్లాన్ మొత్తాన్ని 105 రేట్లు కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందిస్తుంది.
  4. హోంలోన్, వ్యక్తిగత రుణ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. ఇది మెచ్యూరిటీ తేదీ వరకు జీవించి ఉన్న వారికి మొత్తం హామీని చెల్లిస్తుంది.
  5. ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్య ప్రయోజనం లాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.
  6. 3 లక్షల వరకు నాన్-మెడికల్ బీమా పాలసీ హామీని కూడా అందిస్తుంది.

ప్రీమియం వార్షిక, అర్ధ-వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ వ్యవధిలో క్రమం తప్పకుండా LIC జీవన్ ఆజాద్ పాలసీని చెల్లించవచ్చు. పాలసీని 2 సంవత్సరాల తర్వాత, కనీసం 2 ప్రీమియంల పూర్తి చెల్లింపుల తర్వాత సరెండర్ చేయవచ్చు. ప్రీమియం చెల్లించిన 2 సంవత్సరాల తర్వాత ప్లాన్ కింద రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఉదాహరణకు, పాలసీదారుడు 1వ సంవత్సరంలో రూ. 25,120, 2వ సంవత్సరంలో రూ. 24,578 ప్రీమియంను ఇలా.. 12 సంవత్సరాల పాటు లేదా, పాలసీ టర్మ్ పూర్తి వరకు చెల్లించాలి. మొత్తం ప్రీమియం 2,95,478 చెల్లించబడుతుంది. మెచ్యూరిటీ మొత్తం సుమారుగా 5,000,000 ఉంటుంది. అయితే, పాలసీదారుడు 20 ఏళ్లలో కనీసం 12 సంవత్సరాలు చెల్లించాల్సి ఉంటుంది.

గమనిక.. పాలసీ ఎంచుకునే ముందు పాలసీ డాక్యుమెంట్ చదివి దాని గురించి వివరంగా తెలుసుకున్న తర్వాతే.. పెట్టుబడి పెట్టడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..