SBI: అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ. 147 కట్ అయ్యిందా? ఎందుకో తెలుసుకోండి..

భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బిఐ. కోట్లాది మంది కస్టమర్లను కలిగి ఉన్న ఎస్‌బిఐ.. తన అకౌంట్ హోల్డర్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సర్వీస్ అందించేందుకు ఎప్పకప్పుడు..

SBI: అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ. 147 కట్ అయ్యిందా? ఎందుకో తెలుసుకోండి..
Sbi
Follow us

|

Updated on: Jan 20, 2023 | 1:56 PM

భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బిఐ. కోట్లాది మంది కస్టమర్లను కలిగి ఉన్న ఎస్‌బిఐ.. తన అకౌంట్ హోల్డర్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సర్వీస్ అందించేందుకు ఎప్పకప్పుడు అప్‌డేట్ అవుతుంటుంది. ఈ క్రమంలో వినియోగదారుల నుంచి కొంత రుసుమును కూడా వసూలు చేస్తుంది. మీకు కూడా ఎస్‌బిఐలో అకౌంట్ ఉందా? మీ అకౌంట్ నుంచి తాజాగా ఉన్నపళంగా రూ. 147 కట్ అయ్యాయా? ఎందుకు కట్ అయ్యాయా? అని టెన్షన్ పడుతున్నారా? మరేం టెన్షన్ పడకండి. ఎస్‌బిఐ తన కస్టమర్ల నుంచి డెబిట్ కార్డ్ వినియోగానికి వార్షిక రుసుము కింద రూ. 147 రూపాయలు కట్ చేసుకుంది. ఈ విషయాన్ని సంస్థ ప్రకటించింది.

ఎస్‌బిఐ తన కస్టమర్స్ ఉపయోగించే డెబిట్ కార్డుల హోస్ట్‌కు వార్షిక నిర్వహణ రుసుముగా రూ. 125, అదనంగా 18 శాతం జీఎస్టీ కలిపి రూ. 147.50 వసూలు చేస్తోంది. ఇక డెబిట్ కార్డు కొత్తది తీసుకోవాలన్నా? మార్చుకోవాలన్నా? రూ. 300 లతో పాటు జీఎస్టీ కూడా వసూలు చేస్తుంది.

క్రెడిట్ కార్డుల ఛార్జీల్లో సవరణలు..

ఇదిలాఉంటే.. ఎస్‌బిఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ వివిధ క్రెడిట్ కార్డ్ సంబంధిత లావాదేవీలపై ఛార్జీలను సవరించింది. ఎస్‌బిఐ కార్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వివరాలను పేర్కొంది. అన్ని రకాల కార్డు లావాదేవీలపై ప్రాసెసింగ్ ఫీజు రూ. 99+జీఎస్టీ విధించడం జరుగుతుందని స్పష్టం చేసింది. అలాగే, అన్ని మర్చంట్ ఈఎంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ ఫీజ్ రూ. 199కి పెంచింది. అలాగే దీనికి జీఎస్టీ కూడా వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి

అతిపెద్ద నెట్‌వర్క్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, కస్టమర్లు, ఉద్యోగుల పరంగా దేశంలోనే అతిపెద్ద వాణిజ్య బ్యాంకు. సెప్టెంబర్ 30, 2022 నాటికి ఈ బ్యాంక్ డిపాజిట్ బేస్ రూ. 41.90 లక్షల కోట్లు. CASA నిష్పత్తి 44.63%. అడ్వాన్స్‌లు రూ. 30 లక్షల కోట్లు. ఎస్‌బిఐ 32.9% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఎస్‌బిఐ భారతదేశంలో 66,757 BC అవుట్‌లెట్‌లతో 22,309 బ్రాంచ్‌లు, 65,796 ATM/ ADWM ల నెట్‌వర్క్ కలిగి ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..