NRI Home Loan: ఎన్ఆర్ఐలు భారత్‌లో హోమ్ లోన్ తీసుకోవచ్చా? నిబంధనలేంటి? ఎలాంటి నియమాలు పాటించాలి?
ఒకవేళ ఎన్ఆర్ఐ ఇండియాలో నిర్మించుకోవాలంటే ఎలా? అసలు ఎన్ఆర్ఐ భారత్ లో ఇళ్లు నిర్మించుకోవడానికి బ్యాంకులు లోన్ ఇస్తాయా? వారు బ్యాంకు లోన్ పొందడానికి ఉన్న నిబంధనలు ఏంటి? లోన్ తీసుకునే సమయంలో ఎలాంటి పత్రాలు అడుగుతారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై ఓ లుక్కేద్దాం.

సొంతిల్లు అనేది ఓ ఎమోషన్. ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా సొంతింట్లో ఉండాలని చాలా మంది అనుకుంటారు. అందువల్ల తమ వద్ద దాచుకున్న సొమ్ముకు కొంత డబ్బు హోమ్ లోన్ తీసుకుని ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. అయితే ఇది ఇండియాలో ఉన్నవారికి అయితే ఓకే గానీ, ఒకవేళ ఎన్ఆర్ఐ ఇండియాలో నిర్మించుకోవాలంటే ఎలా? అసలు ఎన్ఆర్ఐ భారత్ లో ఇళ్లు నిర్మించుకోవడానికి బ్యాంకులు లోన్ ఇస్తాయా? వారు బ్యాంకు లోన్ పొందడానికి ఉన్న నిబంధనలు ఏంటి? హోమ్ లోన్ తీసుకునే సమయంలో ఎలాంటి పత్రాలు అడుగుతారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై ఓ లుక్కేద్దాం.
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
ఎన్ఆర్ఐ దరఖాస్తుదారుడు హోమ్ లోన్ ముందుగా దరఖాస్తును పూర్తి చేసి, దానిపై సంతకాలు చేసి ఫొటోలతో కూడిన దరఖాస్తు ఫారాన్ని బ్యాంకు అధికారులకు అందించాలి. అలాగే దరఖాస్తుపై సంతకం చేయడానికి, అలాగే బ్యాంకు ఉత్తరప్రత్యుత్తరాల కోసం భారతీయ నివాసికి అధికారం కల్పించేలా పవర్ ఆఫ్ అటార్నీ పత్రాన్ని కూడా అందించాలి.
పవర్ ఆఫ్ అటార్నీ
పవర్ ఆఫ్ అటార్నీ (పీఓఏ) మీ తరపున ఆస్తి లావాదేవీని పూర్తి చేయడానికి భారతదేశంలో నివసిస్తున్న మరొక వ్యక్తికి అధికారం ఇస్తుంది. మీరు నివసించే దేశంలో కాన్సులేట్ అధికారి లేదా నోటరీ సమక్షంలో ఈ పీఓఏపై మీరు సంతకం చేయాలి. దీన్ని వారు గుర్తించాలి. పైగా అది చెల్లుబాటు కావడానికి భారతదేశంలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించి తగిన పత్రాలను తీసుకోవాలి.
ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
- భారతీయ పాస్‌పోర్ట్, వీసా కాపీ. ఒకవేళ భారతీయ పాస్‌పోర్ట్ అందుబాటులో లేకపోతే, మీరు విదేశీ పాస్‌పోర్ట్‌ని కలిగి ఉంటే పీఓఐ కార్డ్. మీ తల్లిదండ్రులు భారత పౌరులు అయితే ఓసీఐ కార్డ్ అవసరం.
- మీ నివాస దేశంలోని వర్క్ పర్మిట్/జాబ్ కాంట్రాక్ట్/అపాయింట్‌మెంట్ లెటర్లు
- గత ఆరు నెలల పే స్లిప్‌లు
- తాజా ఆదాయపు పన్ను రిటర్న్స్
- ఒక సంవత్సరం ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ ఖాతాల బ్యాంక్ స్టేట్‌మెంట్లు
కావాల్సిన్ టైటిల్ డాక్యుమెంట్స్
- టైటిల్ డీడ్ (విక్రేత పేరుతో). కొన్ని రాష్ట్రాల్లో నిబంధనలు వేరుగా ఉంటాయి. వాటికి అనుగుణంగా టైటిల్ డీడ్ ను బ్యాంకులను అందించాలి.
- ఆమోదించిన ప్లాన్/బిల్డింగ్ అనుమతి
- వృత్తి ధ్రువీకరణ పత్రం (ఇది సిద్ధంగా ఉన్న భవనం అయితే)
- పాత టైటిల్ డీడ్‌లు ఏవైనా ఉంటే
- నవీకరించబడిన ఎన్ కంబరెన్స్ సర్టిఫికేట్
- షేర్ సర్టిఫికేట్ (సహకార హౌసింగ్ సొసైటీ అయితే)
- చుట్టు పక్కల వారి నుంచి ఎన్ఓసీ
- రెరా నమోదు కాపీ
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి







