AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులకు మోడీ సర్కార్ గుడ్‌ న్యూస్.. బ్యాంకులకు కీలక ఆదేశాలు.. అదే జరిగితే అన్నదాతలకు పండగే..

Kisan Credit Card: కేంద్ర ప్రభుత్వ పథకం కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్ ద్వారా రైతులు అతి తక్కువ వడ్డీకి రుణాన్ని పొందవచ్చు. ఈ పథకాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వల్పకాలిక రుణాన్ని అందించే లక్ష్యంతో ప్రారంభించింది.

రైతులకు మోడీ సర్కార్ గుడ్‌ న్యూస్.. బ్యాంకులకు కీలక ఆదేశాలు.. అదే జరిగితే అన్నదాతలకు పండగే..
Kisan Credit Card
Shaik Madar Saheb
|

Updated on: Jan 20, 2023 | 6:44 PM

Share

Kisan Credit Card: కేంద్ర ప్రభుత్వ పథకం కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్ ద్వారా రైతులు అతి తక్కువ వడ్డీకి రుణాన్ని పొందవచ్చు. ఈ పథకాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వల్పకాలిక రుణాన్ని అందించే లక్ష్యంతో ప్రారంభించింది. ఈ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక రంగాలలోని రైతులు అవసరమైన వ్యవసాయ రుణాన్ని పొందవచ్చు. రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా గరిష్టంగా రూ.3లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బడ్జెట్‌కు మరికొద్ది రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతపరిచేందుకు చర్యలు చేపట్టిందన్న అంచనాల మధ్య దేశంలోని రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులను ప్రభుత్వం గురువారం ఆదేశించింది.

బ్యాంకింగ్ సెక్రటరీ వివేక్ జోషి అధ్యక్షతన జరిగిన బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యలను చేపట్టేందుకు పీఎం కిసాన్ డేటాబేస్ సహాయం తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లను ఆదేశించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల పురోగతి ఫండ్ (AIF) పథకాన్ని కూడా సమావేశంలో సమీక్షించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

వ్యవసాయ రుణాలకు సంబంధించిన సమీక్ష కూడా జరిగిన ఈ సమావేశంలో జరిగినట్లు పేర్కొంటున్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల్లో పారదర్శకతను పెంపొందించేందుకు, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మరింత ప్రయోజనం అందించేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియ పురోగతిపై కూడా చర్చించారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాల మొత్తం ప్రయాణాన్ని సమయానుకూలంగా డిజిటలైజ్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సూచించారు.

ఇవి కూడా చదవండి

ఈ సమావేశంలో, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY), ప్రధాన మంత్రి సహా వివిధ సామాజిక భద్రతా పథకాల పురోగతి. ముద్ర, ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి (PMSVANidhi), అగ్రి క్రెడిట్ మొదలైన వాటి గురించి కూడా సమీక్షించారు.

స్థిరమైన బ్యాంకింగ్ సంబంధాల కోసం కస్టమర్ అనుభవాన్ని మరింత సుసంపన్నంగా, సులభంగా మార్చేందుకు బ్యాంకులు అన్ని విధాలా కృషి చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో నొక్కి చెప్పినట్లు సమాచారం. భారతీయ బ్యాంకుల సంఘం (IBA) ఇప్పటికే అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు వినియోగదారుల సేవా రేటింగ్‌ను వేగవంతం చేయాలని అభ్యర్థించింది. వినియోగదారుల అంచనాలను అందుకోవడానికి, కస్టమర్‌లలోని ప్రతి విభాగానికి అందించే సేవల ప్రమాణాలను బ్యాంకులు పెంచడానికి వీలు కల్పిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే.. రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్టులు లభించడంతోపాటు.. అతి తక్కువ వడ్డీకే రుణం లభించనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..