రైలు ప్రయాణం సామాన్యుడికి సులభతరం అయ్యేనా? వార్షిక బడ్జెట్‌పై చిరుద్యోగి అభిప్రాయం

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్రం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌ సందర్భంగా కోటి ఆశలు నెలకొని ఉన్నాయి. కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్‌. ఎందుకంటే 2024లో అసెంబ్లీ ఎన్నికలు..

రైలు ప్రయాణం సామాన్యుడికి సులభతరం అయ్యేనా? వార్షిక బడ్జెట్‌పై చిరుద్యోగి అభిప్రాయం
Railway Budget 2023
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Jan 20, 2023 | 1:41 PM

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్రం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌ సందర్భంగా కోటి ఆశలు నెలకొని ఉన్నాయి. కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్‌. ఎందుకంటే 2024లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. దీంతో ఈ బడ్జెట్‌లోనైనా తమ ఆశలు నెరవేరుతాయా? అని ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్‌ సందర్భంగా కేంద్రం ప్రజల అభిప్రాయం కోరింది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మంత్రి నిర్మలమ్మకు లేఖలు రాస్తున్నారు.

నిర్మలా మేడమ్

నమస్తే.. నా పేరు రాజీవ్

ఇవి కూడా చదవండి

నేను ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం నివాసిని.. నేను తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఒక చిన్న కంపెనీలో పని చేస్తున్నాను. పండగకు మా వూరు వెళ్లాలని.. నేను విశాఖ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీ మెట్ల మీద కూర్చొని నా ప్రయాణం ప్రారంభించాను.స్లీపర్‌లో నా రిజర్వేషన్ కన్ ఫర్మ్ కాలేదు. దాదాపుగా రెండు నెలల ముందే రిజర్వ్ టికెట్స్ అయిపోయి.. వెయిట్ లిస్ట్ వచ్చింది. ఇప్పుడు మా వూరికి కన్ ఫర్మ్ రిజర్వ్ అసలు టికెట్ ఖరీదు 635 రూపాయలు. దీనికోసం ఏజెంట్ రూ.1500 డిమాండ్ చేస్తున్నాడు.

నా దగ్గర అంత డబ్బు లేదు. అందుకే ఇలా కిక్కిరిసిన జనరల్ బోగీలో.. మెట్ల మీద కూచుని నా ప్రయాణం మొదలు పెట్టాను.. అయినా ఏమి ఇబ్బంది లేదు. నేను ఒంటరిగా లేను. ఇలా ప్రయాణం చేసే వాడిలో నెనే మొదటి వాడిని కాదు. దేశంలో మూడు తరాలు గడిచినా సాధారణ రైల్వే ప్రయాణికుల భవితవ్యం మాత్రం మెరుగుపడలేదు

ఇది బడ్జెట్ సీజన్.. ఇంకా నా ప్రయాణం చాలా దూరం సాగుతుంది. ఈమధ్య ఎక్కడో మీరు బడ్జెట్ సలహాలు అడిగారని చదివాను. అందుకే మీకు ఈ ఉత్తరం రాయాలని అనిపించింది. అలా ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఈ ఉత్తరం రాయడం మొదలుపెట్టాను. రైలు వేగం.. జనం తోపులాటలు.. రైలు కుదుపుల మధ్య నా ఆలోచనలు కుదిరాయి

నిర్మలా మేడమ్.. నేను గత 15 సంవత్సరాలుగా రైలులో ప్రయాణిస్తున్నాను. ముఖ్యంగా ప్రతి పండక్కీ రెలులోనే ఊరు వెళతాను. రైల్వేలో ఎన్నో మార్పులు చూశాను. కానీ, ఇన్ని మార్పులు చేసినా ఈ టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్ ఎందుకు అంతం కాలేదో అర్థం కావడంలేదు.

రైలు బడ్జెట్లు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. బడ్జెట్ పరిమాణం పెరిగింది. కానీ జనరల్ బోగీలో ప్రయాణించే నాలాంటి ప్రయాణికుడి రోజులు మారలేదు. చాలా స్టేషన్లు, రైళ్లు ఇప్పటికీ అపరిశుభ్రంగానే ఉన్నాయి. టిక్కెట్ల కోసం పెనుగులాట తగ్గేలా కనిపించడం లేదు.

స్టేషన్‌లో లభించే టీ దగ్గర నుంచి ఫుడ్ వరకూ మరింత ఖరీదైనదిగా మారింది. అయితే, రుచి.. శుభ్రత విషయంలో మరింత అధ్వాన్నంగా తయారైంది. రైల్వేకు చెందిన చిన్న చెల్లెలు అంటే లోకల్ ట్రైన్.. అదే EMU పరిస్థితి అయితే అసలు చెప్పాల్సిన పనే లేనంత దారుణంగా ఉంటుంది.

ఖరీదైన రైళ్లలో ప్రయాణించే వారు.. ట్వీట్ చేయడం ద్వారా మిమ్మల్ని అభినందిస్తున్నారు. వారు తింటున్న ఆహారం, పానీయాల ఫోటోలను పోస్ట్ చేసి రైల్వే గొప్పతనం చెబుతున్నారు. ఇది నిజమే కావచ్చు. కానీ, ఇప్పుడు జనరల్ బోగీలో ఏం తిప్పలు పడ్డామో ఇంట్లో కూడా చెప్పలేకపోతున్నాం.

ఆర్థిక మంత్రి గారూ.. స్వచ్ఛమైన రైళ్లలో ప్రయాణించడం, సమయానికి చేరుకోవడం ఇలాంటి మంచి సౌకర్యాలకు మేము కూడా అర్హులమే కదా. ఇప్పుడు ప్రత్యేక రైలు బడ్జెట్ అనే కథ ముగిసింది. రైల్వేల గురించి సాధారణ బడ్జెట్ లోనే వినిపిస్తున్నారు. అందుకే మీకు ఈ లెటర్ రాస్తున్నాను.

నిర్మలా మేడమ్.. నా కొడుకు యూట్యూబ్‌లో విదేశీ రైలు వీడియో చూశాడు. నాన్న మన రైలు కూడా ఇలాగే ఉంటే బావుంటుంది కదా అని అడిగాడు.. ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు. కానీ, ఇప్పుడు వాడికి నేను ఏమి మాధానం చెప్పాలో బడ్జెట్‌లో మీరు చెప్పాలి. నా కొడుకు కలల ట్రైన్ సరైన ట్రాక్‌లో నడుస్తుందని నేను ఆశిస్తున్నాను

మీ

రాజీవ్

మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి