Vehicle Scrappage Policy: 15 ఏళ్ల నాటి వాహనాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు, వాహనాల ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు భారత ప్రభుత్వం 'వెహికల్ స్క్రాప్ పాలసీ'ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో దేశంలోని 15 ఏళ్ల నాటి వాహనాలను..

Vehicle Scrappage Policy: 15 ఏళ్ల నాటి వాహనాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
Vehicle Scrappage Policy
Follow us
Subhash Goud

|

Updated on: Jan 20, 2023 | 11:48 AM

వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు, వాహనాల ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు భారత ప్రభుత్వం ‘వెహికల్ స్క్రాప్ పాలసీ’ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో దేశంలోని 15 ఏళ్ల నాటి వాహనాలను చెత్తకుప్పలకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు దీని కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. ప్రస్తుతం ఏయే వాహనాలను రద్దు చేయబోతున్నారో ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. స్క్రాప్ కోసం పంపిన వాహనాలు రీసైకిల్ చేయబడతాయి. దీని నుండి మెటల్, రబ్బరు, గాజు మొదలైన అనేక వస్తువులు లభిస్తాయి. వీటిని వాహనాల తయారీలో మళ్లీ ఉపయోగించవచ్చు.

నోటిఫికేషన్ ప్రకారం.. ఏప్రిల్ 1 నుండి దేశంలోని 15 ఏళ్ల ప్రభుత్వ వాహనాలన్నీ స్ర్కాప్‌గా మారుతాయి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 15 ఏళ్లు పైబడిన వాహనాలు, రవాణా సంస్థలకు చెందిన బస్సులు, ప్రభుత్వ సంస్థల వాహనాలు కూడా ఉన్నాయి.

ఏప్రిల్‌ 1 నుంచి రిజిస్ట్రేషన్లు రద్దు:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 15 ఏళ్లు దాటిన వాహనాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల పాత బస్సుల రిజిస్ట్రేషన్‌ను ఏప్రిల్‌ 1 నుంచి రద్దు చేయనున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇవన్నీ కూడా స్క్రాప్‌గా మారుతాయి. రక్షణ, శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, నిర్వహణ తదితర పనుల్లో నిమగ్నమైన వాహనాలకు వాహనాలను స్క్రాప్‌కు పంపాలన్న నిబంధన వర్తించదని ఈ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. వీటిలో సాయుధ, ఇతర ప్రత్యేక వాహనాలు ఉన్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్‌ తేదీ నుంచి 2023 ఏప్రిల్‌ 1 నాటికి 15 ఏళ్లు పూర్తవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అవి మోటార్ వెహికల్ రూల్స్-2021 ప్రకారం స్క్రాప్‌కు పంపుతారు. ఈ చట్టం ప్రకారం.. రిజిస్టర్డ్ వాహనాలను స్క్రాప్‌కు పంపే పని దేశవ్యాప్తంగా తెరిచిన రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాప్ సెంటర్ల ద్వారా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

వాహన స్క్రాప్ విధానం ఏమిటి?

2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం వాహనాల స్క్రాప్ విధానాన్ని ప్రకటించింది. ఇందులో ప్రైవేట్ వాహనాలకు 20 ఏళ్ల తర్వాత, కమర్షియల్ వాహనాలకు 15 ఏళ్ల తర్వాత ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్ పరీక్షలో క్లియర్ అయిన తర్వాతే వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ అవుతుంది. ఈ విధానం దేశంలో ఏప్రిల్ 1, 2022 నుండి వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. మీ వాహనాలు ఏదైనా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో స్క్రాప్‌కు పంపబడి, దాని స్థానంలో కొత్త వాహనం తీసుకున్నట్లయితే కొత్త వాహనంపై ప్రజలకు 25 శాతం వరకు రహదారి పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి