Minimum Balance: బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఇకపై మినిమమ్‌ బ్యాలెన్స్‌ రూల్‌ లేనట్లేనా..?

ప్రస్తుత రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం.. బ్యాంకు ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్ లేకుంటే పెనాల్టీ ఛార్జీలు ఉంటాయి. ప్రాంతాల వారీగా ఏ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్‌ మెయింటెయిన్‌ చేయాలో గతంలో..

Minimum Balance: బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఇకపై మినిమమ్‌ బ్యాలెన్స్‌ రూల్‌ లేనట్లేనా..?
Bank
Follow us

|

Updated on: Jan 19, 2023 | 2:44 PM

ప్రస్తుత రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం.. బ్యాంకు ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్ లేకుంటే పెనాల్టీ ఛార్జీలు ఉంటాయి. ప్రాంతాల వారీగా ఏ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్‌ మెయింటెయిన్‌ చేయాలో గతంలో ఆర్బీఐ బ్యాంకులకు సూచించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి బ్యాంకు ఖాతాల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకుంటే పెనాల్టీ ఛార్జీలు పడటం తప్పనిసరి. అయితే ఈ బ్యాంకు కస్టమర్లకు త్వరలో శుభవార్త అందబోతున్నట్లు తెలుస్తోంది. మీ బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ నిర్వహించనందుకు మీకు ఎప్పుడైనా జరిమానా విధించినట్లయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కనుక అమలైతే భవిష్యత్తులో మీరు పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్త రూల్ చేసిన తర్వాత మీరు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వివిధ బ్యాంక్ ఖాతాల ప్రకారం.. కనీస బ్యాలెన్స్ వేర్వేరు మొత్తం నిర్ణయించబడుతుంది. ఆ పెనాల్టీ ఛార్జీల్లో జీఎస్టీ కూడా ఉంటుంది. ఖాతాదారుడు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఈ మినిమమ్ బ్యాలెన్స్‌ మెయింటెయిన్‌కు సంబంధించి ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కిషన్‌రావ్ కరాద్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. బ్యాంకుల డైరెక్టర్ల బోర్డుకు విజ్ఞప్తి చేసి మినిమమ్ బ్యాలెన్స్ ఉంచని వారి ఖాతాలపై పెనాల్టీ రద్దుకు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. అయితే ఈ నెలాఖరు నుంచి బడ్జెట్‌ సమావేశాలు ఉన్నాయి. బడ్జెట్‌ కంటే ముందు ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయిన బిజినెస్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బ్యాంక్ అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ మెయింటెయిల్ చేయడం రద్దు చేసే అధికారం.. బ్యాంకుల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేతిలో ఉంటుందని గతంలో ఆయన అన్నారు. ఖాతాదారులకు పెనాల్టీ ఛార్జీలు విధించకుండా చూసుకునే బాధ్యత వారిపైనే ఉంటుందని అన్నారు. అయితే ఇప్పుడు బడ్జెట్‌ సమావేశాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రి విజ్ఞప్తితో డైరెక్టర్ల బోర్డు బ్యాంకు ఖాతాలో కనీస మొత్తాన్ని ఉంచుకోనందుకు జరిమానాను మాఫీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆ సమయంలో, కనీస మొత్తాన్ని నిర్వహించడంపై మీడియా రాష్ట్ర ఆర్థిక మంత్రిని ప్రశ్నించింది. నిర్ణీత కనీస స్థాయి కంటే తక్కువ డిపాజిట్లు ఉన్న ఖాతాలపై ఎలాంటి జరిమానా విధించకూడదని బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. ఈ ఆదేశాలను బ్యాంకులు అమలు చేస్తే ఖాతాల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉండాల్సిన అవసరం ఉండదు. అలాంటి వారికి ఇది ఓ శుభవార్త అని చెప్పాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?