AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Driving License: డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లే ముందు ఈ విషయాలను గుర్తించుకోండి.. లేదంటే లైసెన్స్ కష్టమే!

18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేస్తారు. ముందుగా లెర్నింగ్ లైసెన్స్..

Driving License: డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లే ముందు ఈ విషయాలను గుర్తించుకోండి.. లేదంటే లైసెన్స్ కష్టమే!
Driving Test
Ravi Kiran
|

Updated on: Jan 19, 2023 | 9:45 AM

Share

దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేస్తుంటారు. ముందుగా లెర్నింగ్ లైసెన్స్.. ఆ తర్వాత కొద్దిరోజులకు అఫీషియల్ లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్తుంటారు. ఆ డ్రైవింగ్ టెస్ట్‌లో అందరూ పాస్ అయితేనే లైసెన్స్ మన చేతికి వస్తుంది. లేదంటే ఇక అంతే. మరి టెస్ట్‌లో మీరు ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఈ ముఖ్యమైన విషయాలను కచ్చితంగా గుర్తించుకోండి. డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చే ముందు, మీరు ట్రాఫిక్‌కు సంబంధించిన ప్రాథమిక నియమాలతో పాటు డ్రైవింగ్‌పై పట్టు సాధిస్తే.. ఫస్ట్ అటెంప్ట్‌లోనే టెస్టులో క్వాలిఫై అవుతారు.

డ్రైవింగ్ టెస్ట్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

  1. డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లేముందు మీరు డ్రైవింగ్‌పై మంచి పట్టు సాధించాలి. వీలైనంత వరకు కారు నడపడం ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. తద్వారా టెస్ట్ ఇచ్చే సమయంలో అది మీకు ఉపయోగపడువచ్చు.
  2. అలాగే మీరు డ్రైవింగ్‌కు నేర్చుకున్న కారును టెస్టుకు తీసుకెళ్లండి. ఎందుకంటే ఆ కారు గురించి మీకు ఇదివరకే అన్నీ ముందే తెలుసు కాబట్టి.. టెస్ట్ టైంలో ఈజీగా డ్రైవ్ చేసేయొచ్చు.
  3. మీ కారులోని అన్ని ప్రాథమిక ఫీచర్లు బాగానే ఉన్నాయా లేదా అని క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ఏదైనా లోపం కనిపిస్తే వెంటనే సరిదిద్దండి. ఎందుకంటే డ్రైవింగ్ టెస్ట్ సమయంలో కారుకు సంబంధించి ఏది సరిగ్గా పని చేయకపోయినా మీరు టెస్ట్‌లో ఫెయిల్ అయినట్లే.
  4. మీరు డ్రైవింగ్ టెస్ట్‌ కోసం తీసుకెళ్తున్న కారు సైడ్ మిర్రర్‌లు, వెనుక ముందు అద్దాలను సరిగ్గా సెట్ చేసుకోండి. టెస్ట్ సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు రోడ్డు చుట్టూ ఉన్న ప్రతీ విషయాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఈజీగా కారును నడపవచ్చు.
  5. కారు నడపడం సులభం అయ్యేంత వరకు దాన్ని నేర్చుకుంటూ ఉండండి. అటు, డ్రైవింగ్ నియమాలు, ట్రాఫిక్ నిబంధనల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. ఎందుకంటే డ్రైవింగ్ టెస్ట్ సమయంలో వాటి ప్రశ్నలు కూడా అడగవచ్చు. అలాగే, కారుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మీతో తీసుకెళ్లండి.

Follow Us
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..
చేతితో కొట్టడం వల్ల రిమోట్ ఎందుకు పనిచేస్తుంది..? అసలు సీక్రెట్..
చేతితో కొట్టడం వల్ల రిమోట్ ఎందుకు పనిచేస్తుంది..? అసలు సీక్రెట్..