Union Budget 2023: ఆ నిషేధం ఎత్తివేసే వరకు నాకు పని ఉండదు.. డబ్బులు రావు.. మంత్రి నిర్మలమ్మకు కూలి లేఖ
మరికొన్ని రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సందర్భంగా సామాన్యుల..
మరికొన్ని రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సందర్భంగా సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు అన్ని వర్గాల గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు. కేంద్రం బడ్జెట్‌పై అభిప్రాయాలు తెలుపాలని సూచించగా, ఎవరికి వారు తమ అభిప్రాయాలను నిర్మలమ్మ ముందుంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ కూలి కూడా తన అభిప్రాయం తెలియజేశాడు.
ప్రియమైన నిర్మాలమ్మా.. , నమస్కారం
నేను సోమయ్య, నేను మహబూబ్ నగర్ లోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడిని. నేను రోజువారీ కూలీగా పని చేస్తున్నాను. నేను హైదరాబాద్ చుట్టూ భవనాలు నిర్మిస్తున్న చోట పని చేస్తున్నాను. ప్రస్తుతం హైటెక్ సిటీ దగ్గరలో కాంట్రాక్టర్ భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఈ రోజు ఉదయం నేను చేతికి రుమాలు కట్టుకుని ఇంటి నుంచి పనికి వచ్చాను. సైట్‌కు వచ్చిన తరువాత, ప్రభుత్వం పనిని నిలిపివేసినట్లు మాకు తెలిసింది. ఇది కాలుష్యానికి సంబంధించిన అంశమని వారు అంటున్నారు. ఇక నిషేధం ఎత్తివేసే వరకు, నాకు పని ఉండదు. దాంతో డబ్బు కూడా ఉండదు.
ఇప్పుడు నేను వచ్చి ఇక్కడి దగ్గరలోని లేబర్ అడ్డా దగ్గర కూర్చున్నాను. నాకేదైనా పని వస్తుందేమోనని ఆశతో..నా భార్య లచ్చి ఇళ్ళల్లో గిన్నెలు నా రోజు కూకడగడం వంటి పాచి పనులు చేస్తుంది. ఇంట్లో చిన్న గ్యాస్ సిలెండర్ తో వంట చేస్తుంది. ఇప్పుడు అది ఖాళీ అయిపోయింది. దానిని నింపించమని లచ్చీ చెప్పింది. అయితే, నిర్మాలమ్మా ఈరోజు నాకు రోజు కూలీ రాలేదు. ఇక్కడ నేను ఖాళీగా పని కోసం ఎదురచూస్తూ కూచున్నపుడు ఒక వార్తాపత్రికలో బడ్జెట్ గురించి చదివాను. నేను కొద్ది కొద్దిగా చదవగలను కానీ ఎలా వ్రాయాలో తెలియదు.. దీంతో రాయడం వచ్చిన ప్రసాద్ తో ఈ ఉత్తరం రాయిస్తున్నాను. నిర్మాలమ్మా.. కరోనా తర్వాత నా జీవితంలో సమస్యలు తగ్గడం లేదు.
మహమ్మారి మా ముసలి తండ్రిని లాక్కుంది..నేను కష్టపడి దాచుకున్నది అంతా అతని మందులకే ఖర్చయింది. అలాగే లాక్‌డౌన్ సమయంలో ఖాళీగా కూచోవలసి వచ్చింది. సంపాదన లేదు. గత సంవత్సరం హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత, నేను 2004లో మొదటిసారిగా హైదరాబాద్ వచ్చినపుడు ఎలాంటి పరిస్థితి ఉందో అలానే ఉంది. మళ్ళీ మొదటి నుంచి నా బతుకు ప్రారంభం అయినట్టు అనిపించింది. మేము రోజువారీ కూలీ పని చేసి ఆ సంపాదనతో బతికే వాళ్ళం. సంపాదన రెండు రోజులు ఆగిపోయిందంటే.. మా పని ఖాతం. తిండి కాదు కదా కనీసం చాయ్ తాగనీకీ పైసలుండవు. అమ్మా, మేము కష్టపడి పనిచేయడానికి భయపడము. మేము మాకు పనులు ఆగకుండా దొరకాలని ఆశిస్తున్నాము.
మీరు మాలాంటి వారి కోసమే ఈ-లేబర్ అనే పోర్టల్‌ని సృష్టించారని కాంట్రాక్టర్ దోస్త్ ఒకరు చెప్పాడు. దీని నుంచి వచ్చిన పనులు మాకు కొంత ఆదాయాన్ని అందించవచ్చని అనుకున్నాం. అందుకే నేను మా లచ్చిమితో కలిసి ఇంటర్నెట్ కేఫ్‌కి వెళ్లి 100 రూపాయలు చెల్లించి రిజిస్టర్ చేసుకున్నాను. కానీ ఏడాది గడిచినా ఏమీ జరగలేదు. నిర్మాలమ్మా, మీరు ప్రభుత్వం. మీరు దేశం మొత్తానికి ఇంత పెద్ద బడ్జెట్ చేస్తారు. కానీ మాకోసం మీరు ఏమీ దాచలేదు.
నాలాంటి చాలా మంది ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. ఈసారి, బడ్జెట్‌లో కొంత పర్మినెంట్ పనికి ఏర్పాట్లు చేయండి.. నగరానికి NREGA లాంటిది రావాలని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది. అమ్మ.. నన్ను నమ్మండి, సంపాదన స్థిరంగా ఉంటే, మిగిలిన విషయాలు వాటంతట అవే దారిలోకి వస్తాయి. అమ్మా.. మాకు అందమైన కూతురు రాధ ఉంది..ఆమె వయసు ఐదేళ్లు. ఆమె మా లచ్చి లా ఇళ్లు శుభ్రం చేయడం మాకు ఇష్టం లేదు. నిర్మాలమ్మా మాకు కూడా మంచిగా జీవించే హక్కు ఉంది. నా కలల కోసం నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.. నాలాంటి వారి కోసం బడ్జెట్ లో ఏదైనా చేయండి..
ఇట్లు మీ
సోమయ్య
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి