Plastic Straw: పదే పదే ప్లాస్టిక్ స్ట్రాతో తాగున్నారా? అయితే జాగ్రత్త.. మీ ఆరోగ్యం రిస్క్‌లో పడినట్లే

ప్లాస్టిక్ స్ట్రాస్ సహాయంతో నీరు లేదా ఏదైనా పానీయం తాగినప్పుడు, దాని హానికరమైన సమ్మేళనాలు మన దంతాల్లోని ఎనామిల్‌తో కలిసిపోతాయి. ఇది దంతాలలో కావిటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

Plastic Straw: పదే పదే ప్లాస్టిక్ స్ట్రాతో తాగున్నారా? అయితే జాగ్రత్త.. మీ ఆరోగ్యం రిస్క్‌లో పడినట్లే
Plastic Straw
Follow us
Basha Shek

|

Updated on: Jan 20, 2023 | 7:45 AM

సాధారణంగా కొబ్బరినీళ్లు , జ్యూస్‌లు తాగడానికి ప్లాస్టిక్‌ స్ట్రాస్‌ని ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో పేపర్ స్ట్రాస్ కూడా వాడుకలో ఉన్నాయి. అయితే చాలామంది నీళ్లు తాగేందుకు కూడా ప్లాస్టిక్‌ స్ట్రాలు వాడుతుంటారు. దీనివల్ల పలు ప్రతికూల సమస్యలు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ పదార్థాలు చాలా హానికరమైన రసాయనాలతో తయారవుతాయి. ఈ పదార్థాలు వేడితో తాకినప్పుడు, దాని రసాయనాలు బయటకు రావడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా మంచినీరు తాగినప్పుడు, ఈ రసాయనాలు మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైనది, ఇది హార్మోన్ స్థాయిలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. పలు అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ప్లాస్టిక్ స్ట్రాస్ సహాయంతో నీరు లేదా ఏదైనా పానీయం తాగినప్పుడు, దాని హానికరమైన సమ్మేళనాలు మన దంతాల్లోని ఎనామిల్‌తో కలిసిపోతాయి. ఇది దంతాలలో కావిటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా దంతాలు బలహీనంగా మారతాయి. భరించలేని నొప్పి ఇతర దంతక్షయ సమస్యలు తలెత్తుతాయి.

ప్లాస్టిక్‌ స్ట్రాలు వాడే వారిలో నోటి వ్యాధులు సంభవించే ప్రమాదం ఉంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం విషయంలో చాలా మంది అశ్రద్ధ చేస్తుంటారు. ఏదో ఒక కూల్‌డ్రింక్‌ తాగటం, జ్యూస్‌లు, జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తినేస్తుంటారు. అయితే, దంత క్షయం, కుహరం, ఇతర నోటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం, ఎరేటెడ్ డ్రింక్స్ తాగడం వల్ల సంభవిస్తాయి. ఇలాంటి సమస్యలు స్ట్రా సహాయంతో కూడా సంభవించే ప్రమాదం ఉందంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. ఇక ప్లాస్టిక్ వాసన చాలా విచిత్రంగా ఉంటుంది. దాని సహాయంతో మంచినీరు లేదా ఇతర పండ్ల రసాలు తాగితే మరింత ఆకలిగా అనిపిస్తుంది. ఫలితంగా ఎక్కువ తింటారు. దీనివల్ల క్రమంగా బరువు పెరుగుతారు. ఇక ప్లాస్టిక్ స్ట్రా పెదవులపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. పడటం ప్రారంభమవుతుంది. అంతేకాదు, ప్లాస్టిక్ స్ట్రా లు ఎక్కువగా వాడేవారిలో తొందరగా వృద్ధాప్య సంకేతాలు బయటపడతాయంటున్నారు. స్ట్రా ను ఉపయోగించి ఏదైనా డ్రింక్ ను ఎక్కువసార్లు పీల్చుకున్నప్పుడు మీ ముఖంపై ముడతలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి