IND vs NZ: 10 ఓవర్లలో 2 మెయిడెన్లు.. 4 వికెట్లతో సూపర్ స్పెల్.. అమ్మ ముందే అదరగొట్టిన హైదరాబాదీ పేసర్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను ఆరంభంలోనే సిరాజ్ దెబ్బతీశాడు. డెవాన్ కాన్వే(10)ను పెవిలియన్ చేర్చి పవర్ ప్లేలో మరోసారి తన పదును చూపించాడు.
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా 12 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేయగా.. కివీస్ 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటయ్యింది. టీమిండియాలో శుభమన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగగా, లక్ష్య ఛేదనలో మైఖెల్ బ్రెస్‌వేల్ (78 బంతుల్లో 140) భారీ సెంచరీతో తుదికంటా పోరాడాడు. అయితే టీమిండియా బౌలర్లు ప్రత్యేకించి హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా 12 పరుగుల తేడాతో చెమటోడ్చి నెగ్గింది. కాగా భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను ఆరంభంలోనే సిరాజ్ దెబ్బతీశాడు. డెవాన్ కాన్వే(10)ను పెవిలియన్ చేర్చి పవర్ ప్లేలో మరోసారి తన పదును చూపించాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (40)ను శార్దుల్ ఠాకూర్ ఔట్ చేయడంతో కివీస్ 70 పరుగులకు ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఇక కుల్దీప్ యాదవ్ కూడా తన గింగిరాలు తిరిగే బంతులతో హెన్రీ నికోలస్ (18), డారెల్ మిచెల్ (9)ను పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే గ్లెన్ ఫిలిప్స్, డారెల్ మిచెల్ కూడా ఔట్ కావడంతో.. న్యూజిలాండ్ 131 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో భారత జట్టు నల్లేరుపై నడకేనని భావించారు.
అయితే బ్రాస్‌వెల్‌కు, మిచెల్ శాంట్నర్ (45 బంతుల్లో 57) ఏడో వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా 57 బంతుల్లోనే సెంచరీ చేసిన బ్రాస్‌వెల్ భారత బౌలర్లను బెంబేలెత్తించాడు. దీంతో కివీస్ విజయానికి ఆఖరి 6 ఓవర్లలో 65 పరుగులు అవసరం కాగా. బ్రేస్‌వెల్, శాంట్నర్ జోరు చూస్తే భారత జట్టుకు భంగపాటు తప్పదేమోననిపించింది. ఈ దశలో మరోసారి మహ్మద్ సిరాజ్ బంతిని అందుకున్నాడు. క్రీజులో కుదురుకున్న శాంట్నర్‌ను పెవిలయన్‌కు పంపిన ఈ హైదరాబాదీ బౌలర్ ఆ తర్వాతి బంతికే షిప్లేను బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ తిరిగి రేసులోకి వచ్చింది. కాగా హైదరాబాద్‌లో తన సొంత ప్రేక్షకుల సమక్షంలో తొలి వన్డే మ్యాచ్ ఆడిన సిరాజ్.. 10 ఓవర్లలో 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అందులో 2 మెయిడిన్లు కూడా ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు అతని తల్లితో పాటు కుటుంబ సభ్యులు కూడా హాజరవ్వడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియలో వైరలవుతున్నాయి.
Family of Mohammed Siraj watching the first ODI in Hyderabad.
A proud moment for Mohammed Siraj ??
?: Disney + Hotstar . . . . .#CricTracker #MohammedSiraj #INDvNZ pic.twitter.com/LVUU3Bn3Tu
— CricTracker (@Cricketracker) January 18, 2023