Bigg Boss Himaja: వారికోసమేనంటూ సంక్రాంతికి కొత్త కారు కొన్న బిగ్‌బాస్‌ హిమజ.. ధర ఎంతో తెలుసా?

తాజాగా హిమజ కొత్త కారుని కొనుగోలు చేసింది . సంక్రాంతి సందర్భంగా తన కుటుంబ సభ్యుల కోసం ఈ కారును కొనుగోలు చేసినట్లు సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు తెలిపింది.

Bigg Boss Himaja: వారికోసమేనంటూ సంక్రాంతికి కొత్త కారు కొన్న బిగ్‌బాస్‌ హిమజ.. ధర ఎంతో తెలుసా?
Bigg Boss Himaja
Follow us
Basha Shek

|

Updated on: Jan 16, 2023 | 11:36 AM

నేను శైలజ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది హిమజ. అందులో పని మనిషిగా చిన్న పాత్రను పోషించినా తన డైలాగ్‌ డెలివరీ, కామెడీతో కడుపుబ్బా నవ్వించింది. ఆతర్వాత మహానుభావుడు, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, వినయవిధేయరామ, చిత్రలహరి, వరుడు కావలెను తదితర సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక మధ్యలో బిగ్‌బాస్‌ షో ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైందీ అందాల తార. ఈక్రేజ్‌తోనే మరిన్ని సినిమా అవకాశాలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తన ప్రొఫెషనల్‌, పర్సనల్‌ విషయాలతో పాటు తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను షేర్‌ చేసుకుంటుంది. తాజాగా హిమజ కొత్త కారుని కొనుగోలు చేసింది . సంక్రాంతి సందర్భంగా తన కుటుంబ సభ్యుల కోసం ఈ కారును కొనుగోలు చేసినట్లు సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు తెలిపింది. ‘ హ్యాపీ సంక్రాంతి.. ఈ సంక్రాంతికి నా ఫ్యామిలీని ఇలా సర్ ప్రైజ్ చేశాను.. వారి సౌలభ్యమే నాకు ముఖ్యం.. మీ అందరి ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యమైంది’ అంటూ తన కొత్త కారు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది హిమజ.

ప్రస్తుతం హిమజ పోస్టు సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకు అభినందనలు చెబుతున్నారు. కాగా ఇంతకీ హిమజ కొన్న కారెదో తెలుసా బ్రాండ్ కియా కార్నివాల్‌. రేటు గురించి పక్కా సమాచారం లేదు కానీ.. సుమారు 40 నుంచి 50 లక్షలు ఉంటుదని తెలుస్తోంది. కాగా ఇటీవ‌ల ఓ సొంత ఇంటిని కూడా నిర్మించుకుంటున్నట్లు తెలిపింది హిమజ. సోషల్‌ మీడియాలో నాలుగు అంత‌స్తుల బిల్డింగ్ వీడియోను కూడా ఆమె షేర్ చేయ‌గా తెగ వైరలయ్యాయి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Himaja? (@itshimaja)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..