IND vs NZ: ఉప్పల్‌లో చరిత్ర సృష్టించిన రోహిత్.. ధోని, గిల్‌క్రిస్ట్‌ల రికార్డులను కొల్లగొట్టిన హిట్‌మ్యాన్
ఈ మ్యాచ్ ద్వారా భారత్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌పై రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా ధోని పేరిట ఉన్న 123 సిక్సర్ల రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు.
తనకు అచ్చొచ్చిన మైదానంలో టీమిండియా మరోసారి జయకేతనం ఎగరవేసింది. హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. అలాగే పలువురు ఆటగాళ్లు కూడా తమ వ్యక్తిగత రికార్డులను మెరుగుపర్చుకున్నారు. కాగా ఈ మ్యాచ్ ద్వారా భారత్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌పై రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా ధోని పేరిట ఉన్న 123 సిక్సర్ల రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. భారత్‌లో రోహిత్, ధోనీ మాత్రమే 100కు పైగా సిక్సర్లు కొట్టగలిగారు. ఈ జాబితాలో 71 సిక్సర్లతో సచిన్ మూడో స్థానంలో ఉన్నాడు. కాగా రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు 265 సిక్సర్లు బాదాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ప్రస్తుతం అతను నాలుగో స్థానంలో ఉన్నాడు. మరొక 6 సిక్సర్లు కొడితే శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్యను అధిగమిస్తాడు.
కాగా ఉప్పల్ మ్యాచ్‌లోనే మరో రికార్డును తనఖాతాలో వేసుకున్నాడు రోహిత్. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 16వ ఆటగాడిగా హిట్‌మ్యాన్ నిలిచాడు. దీంతో ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను వెనక్కునెట్టేశాడు. రోహిత్ 232 వన్డేల్లో ఇన్నింగ్స్‌లలో 48.63 సగటు, 89.60 స్ట్రైక్ రేట్‌తో 9,630 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు మరియు 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో 38 బంతులు ఎదుర్కొన్న హిట్ 4 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 34 పరుగులు చేశాడు. టిక్నర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
Double Hundred Club ?? Triple The Fun ✅
How excited are you for this interview ?
Coming ? on https://t.co/Z3MPyeL1t7 ⏳#TeamIndia | #INDvNZ pic.twitter.com/7SYtSzIOb4
— BCCI (@BCCI) January 18, 2023
మరిన్నిక్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..